BigTV English

Anand Devarakonda Interview: విజయ్ – రష్మిక మధ్య అదే నడుస్తుంది.. కుండ బద్దలు కొట్టేసిన ఆనంద్ దేవరకొండ!

Anand Devarakonda Interview: విజయ్ – రష్మిక మధ్య అదే నడుస్తుంది.. కుండ బద్దలు కొట్టేసిన ఆనంద్ దేవరకొండ!

Anand Devarakonda on Vijay Devarakonda and Rashmika Relation: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మధ్య ఏం జరుగుతుందో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. గీతగోవిందం సినిమాతో వీరిద్దరి పరిచయం ఏర్పడింది. ఈ సినిమాలో వీరి రొమాంటిక్స్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. విజయ్ వలనే రష్మిక తన ఎంగేజ్ మెంట్ ను క్యాన్సిల్ చేసుకుంది అని వార్తలు ఇప్పటికీ షికారు చేస్తూనే ఉంటాయి. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ లో నటించారు.


సినిమాల విషయం పక్కన పెడితే.. ఎప్పుడు విజయ్ -రష్మిక జంటగానే కనిపిస్తో ఉంటారు. ఒకవేళ సింగిల్ గా ఫోటోలు పెట్టినా లొకేషన్ తో ఇద్దరూ ఒకే చోట ఉన్నారని ఫ్యాన్స్ కనిపెట్టేస్తున్నారు. అసలు మా మధ్య ఏం లేదు.. మేము కేవలం స్నేహితులమే అని పైకి చెప్తున్నా.. వీరి లవర్స్ అని ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ కూడా నమ్మేస్తున్నారు. విజయ్ గురించి మాట్లాడిన ప్రతిసారి రష్మిక నగుమోములో సిగ్గు.. రష్మిక నా ఫేవరేట్ అని విజయ్ చెప్పే మాటలు అన్ని వీరి ప్రేమను బయటపెడుతున్నాయి. ముఖ్యంగా ఈ జంట మాల్దీవ్స్ కు వెళ్లిన ఫోటోలు ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఈ వెకేషన్ కు వీరు జంటగా వెళ్లారు అని ఫ్యాన్స్ కన్ఫర్మ్ చేసేస్తున్నారు.

ఇప్పటివరకు ఈ ఫోటోలపై విజయ్- రష్మిక స్పందించింది లేదు. తాజాగా ఈ వెకేషన్ పై అన్నది దేవరకొండ స్పందించాడు. అన్న ప్రేమ వ్యవహారంపై తమ్ముడు క్లారిటీ ఇచ్చాడు. బేబీ లాంటి హిట్ సినిమా తరువాత ఆనంద్ దేవరకొండ గంగం గణేశా అనే సినిమా చేశాడు. ఈ సినిమా మే 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన ఆనంద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.ఈ సినిమాలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ .. ఆనంద్ ఫ్రెండ్ గా కనిపిస్తున్నాడు.


Also Read: Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక.. ?

ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఇమ్ము.. ఆనంద్ ను ర్యాండమ్ ర్యాపిడ్ ఫైర్ అడిగాడు. అందులో మీ అన్న విజయ్.. స్టార్ హీరోయిన్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. వాళ్ళిద్దరి మధ్య ఏం నడుస్తుంది అని అడగ్గా.. వారిద్దరి మధ్య స్క్రిప్ట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఆనంద్ కామెడీ కోసం మాత్రమే అన్నట్లు తెలుస్తోంది. అంతే కాదు.. గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మికనే గెస్ట్ గా రాబోతుంది. ఏది ఏమైనా ఈ ముగ్గురు.. కచ్చితంగా ఏదో దాస్తున్నారని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆనంద్.. బేబీ తరువాత అలాంటి హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×