BigTV English

Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక..?

Rashmika Mandanna: విజయ్ తో పెళ్లి ఫిక్స్.. ఎట్టకేలకు బయటపెట్టిన రష్మిక..?

Rashmika Mandanna Blushe in Gam Gam Ganesha Pre Release Event: ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ అందం రష్మిక మందన్నా. మొదటి సినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న ఈ భామ గీతగోవిందం సినిమాతో నేషనల్ క్రష్ లిస్ట్ లో చేరిపోయింది. ఇక ఈ సినిమా తరువాత రష్మిక మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. స్టార్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది.


అమ్మడు సినిమాల గురించి పక్కన పెడితే.. రష్మిక, హీరో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు .. షికార్లు చేస్తూనే ఉన్నాయి. అయితే తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని ఈ జంట బయట చెప్పుకుంటూ తిరుగుతున్నా బయట మాత్రం బాగానే వెకేషన్స్ కు వెళ్తూ ప్రేమికులుగా ఉంటున్నారు. ఇక ఎప్పుడు రష్మిక ఫోటో పెట్టినా.. అందులో విజయ్ ఖచ్చితంగా ఉంటాడు.

ఏ పండగ వచ్చినా విజయ్ ఇంటిదగ్గరనే రష్మిక కనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరి మధ్య రిలేషన్ నడుస్తుందని వస్తున్న వార్తలు నిజమే అని నేడు కన్ఫర్మ్ అయిపోయింది. ఆ విషయాన్నీ రష్మికనే చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసింది.


Also Read: Bengaluru Police Notice Again Hema: హేమాకు మరోసారి, జూన్ ఫస్ట్ రావాలంటూ..

ఇక ఈ ఈవెంట్ లో ఆనంద్ – రష్మిక మధ్య జరిగిన ఒక సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆనంద్.. రష్మికను నీ ఫేవరేట్ కో స్టార్ ఎవరు అని అడగ్గా.. ఫ్యాన్స్ రౌడీ.. రౌడీ.. రౌడీ అంటూ అరవడం మొదలుపెట్టారు. ఇక రష్మిక.. మైక్ ఆఫ్ చేసి.. ఆనంద్ ను నీఅబ్బా అని తిడుతూ.. ఆనంద్.. నువ్వు నా ఫ్యామిలీ రా.. నువ్వు కూడా ఇలా చేయొచ్చా అని సిగ్గుపడింది. అంతేకాకుండా తన ఫేవరేట్ కో స్టార్ రౌడీ బాయ్ అంటూ విజయ్ గురించి చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సిగ్గుతోనే ఆమె విజయ్ తో రిలేషన్ లో ఉన్నట్లు తెలిసిపోతుంది. ఇక ఆనంద్ ను తన ఫ్యామిలీ అని చెప్పింది అంటే.. వీరు త్వరలోనే ఫ్యామిలీ అవుతున్నారని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×