Anasuya Bharadwaj : సినీ నటుడు శివాజీ మహిళల వస్త్రధారణ పై చేసిన వ్యాఖ్యలపై నటి అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్ట్ లు పెడుతున్నారు.. ఆమె పోస్టు ల పై జనాల రియాక్షన్ కూడా అలాగే ఉంది. ఎక్కడా తగ్గకుండా బికినీలోని ఫోటోలను పోస్ట్ చేస్తుంది. ఇప్పుడు తాజాగా మరో సెన్సేషనల్ పోస్ట్ చేసింది. మహిళల గురించి ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఇంతకీ అనసూయ పెట్టిన పోస్ట్ లో ఏముందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సినీ నటి అనసూయ ఏం చేసిన ప్రస్తుతం సెన్సేషనల్ అవుతుంది.. ఈ మధ్య శివాజీ చేసిన వ్యాఖ్యలపై ఈమె స్పందించిన తీరు జనాలను ఆలోచనలు పడేసింది. ఆయన వస్త్రధారణ గురించి మాట్లాడితే అనసూయ మాకు స్వేచ్ఛ ఉంటుంది అంటూ మొదలుపెట్టి ప్రతిరోజు ఏదో ఒక వివాదంలో తలదురుస్తూనే ఉంది.. ఇదిలా ఉండగా తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో మరో పోస్ట్ పెట్టింది.. ఆ పోస్ట్ లో ఏముందంటే.. తన ఉనికిని చాటుకోవడానికి ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోని మహిళే నిజమైన అందగత్తె అని ఆమె పేర్కొన్నారు. తనదైన సత్యంతో హుందాగా నడుస్తూ, ఇతరులకు స్ఫూర్తినిచ్చే మహిళలే ఆదర్శం, నిజమైన అందగత్తెలు అని రాసుకొచ్చింది. ఆత్మవిశ్వాసమే అలంకారమని, తన వ్యక్తిత్వమే విజయానికి నిదర్శనమని చెబుతూ, మహిళల సాధికారతపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది.. మరి దీనిపై ఎలాంటి కామెంట్స్ వస్తాయో చూడాలి..
Also Read: హీరోలను తాకిన బికినీ ట్రెండ్.. ఇదేం ట్విస్ట్ రా నాయనా..
శివాజీ వ్యాఖ్యల పై యాంకర్ అనసూయ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వివాదంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేయగా, మరికొందరు అనసూయకి మద్దతుగా పోస్టులు పెట్టారు.. ఇదే ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. ఇప్పుడు మరో న్యూస్ ట్రెండ్ అవుతుంది. గతంలో అనసూయ జబర్దస్త్ షో లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. హైపర్ ఆది స్కిట్లో అనసూయ వ్యాఖ్యలపై ఇప్పుడు రాశి ఫైర్ అయ్యారు. ఆ ఎపిసోడ్ లో అనసూయ ‘రాశి గారి ఫలాలు’ అనడంతో పాటు నవ్వేస్తుంది. అప్పుడు జడ్జీగా ఉన్న రోజా కూడా నవ్వుతుంది.. శివాజీ ఇష్యు పై మాట్లాడిన రాశి అనసూయ చేసిన వ్యాఖ్యల పై తప్పుపట్టారు..రాశి ఫలాలు అంటే ఫైన్. కానీ రాశి గారి ఫలాలు అంటే అందులో నేను ఉన్నా. జడ్జెస్ లో ఓ ఆవిడ ఉన్నారు లేడీ. హహహ అని నవ్వారు. ఆ ప్లేస్ లో నేను ఉంటే ఆపేసేదాన్ని. బాడీ షేవింగ్ చేసే హక్కు తల్లిదండ్రులకే లేదు అలాంటిది ఇంకొక మహిళ అనడంపై సీరియస్ అయ్యారు. రాశి వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.. మరి దీనిపై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.. ఇక అనసూయ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..