E-Paper
Advertisement

Anchor Rashmi: చికిత్సే లేని అరుదైన వ్యాధి బారిన పడిన యాంకర్ రష్మీ..

Anchor Rashmi: చికిత్సే లేని అరుదైన వ్యాధి బారిన పడిన యాంకర్ రష్మీ..
Advertisement

Anchor Rashmi: ఈ మధ్యకాలంలో స్టార్ హీరోయిన్లు అరుదైన వ్యాధులతో బాధపడుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సమంత, అనుష్క, ఇలియానా లాంటివారు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాజాగా యాంకర్ రష్మీ కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతుందట. తనకు రూమటాయిడ్‌ అనే సమస్య ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

ఇక ఈ సమస్య ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందట. అంటే ఎవరికైన దెబ్బ తగిలితే.. కొన్నిరోజులు దానంతట అదే తగ్గిపోతుంది. కానీ, ఈ వ్యాధి ఉన్నవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండడంతో ఏ దెబ్బ తగిలినా వెంటనే తగ్గదంట. దీని వలన ఒంట్లో శక్తి మొత్తం కోల్పోయి నీరసమైపోతారట. ప్రస్తుతం రష్మీ ఇలాంటి వ్యాధితోనే పోరాడుతున్నట్లు ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

Advertisement

ఇక దీనికి ఎలాంటి చికిత్స లేదని.. లైఫ్ స్టైల్ ల్లో మార్పులు చేసుకుంటే ఫలితం ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. బాగా ఎక్కువ ఉంటే ఆయుర్వేద మందులు వాడొచ్చని, 12 ఏళ్ళ వయస్సులో తాను దీనికి స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. జబర్డస్త్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రష్మీ ఒకరు. అనసూయ తరువాత యాంకర్ గా ముద్దుగుమ్మ మంచి పేరు తెచ్చుకుంది.

ఇక ఈ పేరుతో ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది. గుంటూరు టాకీస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకుంది. దీని తరువాత రాణి గారి బంగళా, అంతంలాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఒకపక్క షోస్, ఇంకోపక్క సినిమాలతో బిజీగా మారింది. మరి ముందు ముందు ఈ చిన్నది హీరోయిన్ గా స్టార్ డమ్ ను అందుకుంటుందేమో చూడాలి.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×