Actress Raasi: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది డెడికేషన్ ఉన్న నటీనటులు ఉన్నారు. ఒక సినిమా కోసం వాళ్లు విపరీతంగా కష్టపడుతుంటారు. ఎన్నో అలవాట్లను మార్చుకుంటారు. మామూలుగా ఒక పాత్ర కోసం ఆహార్యం ఇలా కావాలి అంటే అలా ఉండటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తారు. చాలా కష్టంతో బరువు తగ్గిపోతారు. అయితే ఇలా తగ్గడం ఒకరకంగా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మంచిదే.
కానీ కొంతమంది దర్శకులు విపరీతంగా బరువు పెరగాలి అని చెబుతూ ఉంటారు. అలా పెరగడం చాలా ఈజీ. కానీ పెరిగిపోయిన తర్వాత తగ్గడం అనేది విపరీతమైన కష్టం. సైజ్ జీరో అనే సినిమా కోసం అనుష్క విపరీతంగా బరువెక్కారు. కానీ ఆ తర్వాత తగ్గడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అలానే కొన్ని పాత్రల వలన సినిమాలు మీద విరక్తి కూడా నటీనటులకు పుడుతుంది. సీనియర్ నటి రాశికు అదే జరిగింది.
నటి రాశి ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. ఇప్పటికీ చాలామంది నటీ రాసి అభిమానులు తారస పడుతుంటారు. అయితే నటి ఒక డైరెక్టర్ పైన సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. మరోసారి ఆ వివాదం తెరపైకి వచ్చింది.
మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా నిజం. ఈ సినిమాలో గోపీచంద్ విలన్ గా నటించారు. ఈ సినిమాలో రాశి కూడా ఒక కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమా కోసం రాశి విపరీతంగా బరువు తగ్గారట. అంతేకాకుండా ఒక జిమ్ ట్రేైనర్ ని పెట్టి స్పెషల్ కేర్ కూడా తీసుకున్నారట. కానీ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజే తనపైన ఒక సీన్ తీస్తున్నప్పుడు తనకి అర్థం అయిపోయింది.
నాకు చెప్పిన కథ ఒకటి నాతో తీస్తున్న సీన్ ఒకటి అని రాసి రియలైజ్ అయ్యారు. అయితే సినిమా పూర్తయినా కానీ రాశి దానిని ఇష్యూ చేయలేదు. అలా అని సినిమా జరుగుతున్నప్పుడే నేను ఇది చేయను అని అప్పుడు చెప్పలేదు. అప్పట్లో దేనికి కారణంగా ఒకసారి మేకప్ వేసుకున్న తర్వాత నేను కొన్ని చేయడానికి ఇష్టపడను. కమిట్ అయ్యాను కాబట్టి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. గతంలో చెప్పింది.
Also Read: OG Ticket: ఏపీలో ‘ఓజి’ స్పెషల్ షోకు గ్రీన్ సిగ్నల్.. టికెట్ ధర తెలిస్తే షాకే!
నాకు ఆ సినిమాకి కథ ఒకటి చెప్పి ఇంకొకటి తీశారు. నేను ఆ సినిమాలు బాగా కనిపిస్తానని నేను చాలా అహిష్టంతో ఆ సినిమాను చేశాను. సినిమా తర్వాత చాలా రోజులు నేను సినిమాలు చేయడం మానేశాను. కేవలం ఆ సినిమాలో చేయడం వల్లే నా కెరియర్ నాశనం అయిపోయింది అంటూ రాశి తెలిపింది. అయితే బిగ్ టీవీ కిస్సిక్ టాక్ షో ప్రోమోలో ఆ దర్శకుడు పేరు, సినిమా పేరు చెప్పలేదు. కానీ గతంలో అందుకే ఆ దర్శకుడు పేరు చెప్పాను అని ప్రోమోలో రివీల్ చేసింది. దీనిని బట్టి తన కెరీర్లో తనకి నచ్చిన సినిమా నిజం అని డిసైడ్ అయిపోవచ్చు. స్వయంగా రాశి కూడా పలుసార్లు చెప్పింది కాబట్టి.