Movie Tickets : ఈ మధ్య ఈ మూవీ టికెట్స్‌కు సంబంధంచి ఒకటి గమనించారా…? ఎప్పటి నుంచో ఈ టికెట్ బుకింగ్స్ రంగంలో ఉన్న బుక్ మై షో కంటే, ఈ మధ్య వచ్చిన డిస్ట్రిక్ట్ యాప్‌లోనే ముందుగా టికెట్స్ వస్తున్నాయి. అలాగే బుక్ మై షో లో కనిపించని టికెట్స్ కూడా ఈ డిస్ట్రిక్ట్‌లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటో గమనించారా ? దాని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కొన్ని రోజుల క్రితం మూవీ టికెట్ బుకింగ్స్ రంగంలో ఒకే ఒక్క యాప్ ఉండేది. అదే బుక్ మై షో. ఎలాంటి సినిమా అయినా… ఎన్ని సినిమాలు అయినా… ఆ ఒక్క యాప్ ద్వారానే బుక్ చేసుకోవడానికి వీలు ఉండేది. తర్వాత పేటీఎంలో అలాంటి సదుపాయం వచ్చింది. ఆ తర్వాత పీవీఆర్ వాళ్లు ప్రత్యేకంగా ఓ యాప్‌ను డిజైన్ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ మధ్య ఫుడ్ డెలవరీ యాప్ ఈ మూవీ టికెట్ బుకింగ్స్‌లో అడుగు పెట్టింది. డిస్ట్రిక్ట్ అనే యాప్‌తో సినిమా టికెట్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే, ఈ మధ్య కాలంలో మూవీ టికెట్స్ అన్నీ ప్లాట్‌ఫాం కంటే… ముందుగా డిస్ట్రిక్ట్ యాప్‌లోనే వస్తున్నాయి.
పుష్ప 2 మూవీ రిలీజ్ టైం నుంచి ఈ డిస్ట్రిక్ట్ యాప్ ఎక్కువగా కనిపిస్తుంది. అప్పుడు కూడా బుక్ మై షో లో కంటే ముందుగానే డిస్ట్రిక్ట్ యాప్‌లోనే కనిపించాయి. అలాగే బుక్ మై షోలో కనిపించని టికెట్స్, కొన్ని థియేటర్స్ ఈ డిస్ట్రిక్ట్ యాప్‌లో కనిపించాయి.
ఇప్పుడు తాజాగా ఓజీ మూవీ టైంలో కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఓజీ మూవీ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే డిస్ట్రిక్ట్ యాప్‌లో కొన్ని థియేటర్స్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశాయి. అలాగే అవి హౌస్ ఫుల్ అయిపోయాయి. కానీ, బుక్ మై షోలో ఇప్పటి వరకు ఒక్క థియేటర్ కూడా కనిపించడం లేదు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి… డిస్ట్రిక్ట్ యాప్ – బుక్ మై షో మధ్య ఎంత తేడా ఉందో.
ఇలా డిస్ట్రిక్ట్ యాప్‌లోనే ఎందుకు ముందుగా టికెట్స్ ఓపెన్ అవుతున్నాయంటే… సినిమా థియేటర్స్‌కి బుక్ మై షో నుంచి డబ్బులు సరైన టైంలో వెళ్లడం లేదట. ఆ జాప్యం వల్ల ఇటు థియేటర్స్ ఓనర్స్… డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు అటు నిర్మాతలపై కూడా ప్రభావం చూపిస్తుంది.
కరెక్ట్‌గా అదే టైంలో ఫుడ్ డెలవరీ యాప్ అయిన జోమాటో.. డిస్ట్రిక్ట్ యాప్‌ను స్టార్ట్ చేసింది. బుకింగ్స్ ద్వారా వచ్చిన డబ్బులను థియేటర్స్ ఓనర్స్‌కి సరైన సమయంలో ఇవ్వడం వల్ల… దాదాపుగా అన్నీ థియేటర్స్ డిస్ట్రిక్ట్ వైపు మారాయి. దీంతో బుక్ మై షో కి ఎర్లీ టికెట్స్ ఓపెన్ అవ్వడం లేదు. పైగా బుక్ మై షో కంటే ఎక్కువ కమీషన్ డిస్ట్రిక్ట్ యాప్ ఇస్తుందట. అందుకే థియేటర్స్ ఓనర్స్ ప్రియారిటీ బుక్ మై షో కంటే ఎక్కువ డిస్ట్రిక్ట్ యాప్‌కు ఉంది.
ఈ రోజు కూడా ఓజీ మూవీ టికెట్స్ ముందుగా డిస్ట్రిక్ట్ యాప్‌లోనే ఓపెన్ అయ్యాయి.