Avika Gor : తెలుగు ప్రేక్షకులను కొన్ని సీనియర్స్ బానిసలను చేశాయి అనడంలో కూడా తప్పులేదు. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది తెలుగు సినిమా ప్రేమికులు తమకు తాము తెలుగు సినిమా బానిసలను చెప్పుకుంటారు. రోజులు మారుతున్న కొద్దీ కొన్ని పదాలు యొక్క అర్థాలు కూడా మారిపోతున్నాయి. బానిసలు అనేది తప్పు పదం ఏమీ కాదు సీరియల్ కు అంతగా అలవాటు పడిపోయారు అనమాట.
చిన్నారి పెళ్లికూతురు (Chinnari pellikuthuru) సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు కార్తీకదీపం (Karthika deepam serial) సీరియల్ లో వంటలక్క (vantalakka) ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath) ఎంత ఫేమస్ అయిందో ఒకప్పుడు అదే స్థాయిలో ఆవికా గోర్ కూడా ఫేమస్. కేవలం సీరియల్ తోనే కాకుండా సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి కొద్దిపాటి సక్సెస్ సాధించుకుంది. మొత్తానికి చిన్నారి పెళ్లికూతురు నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుంది.
పతి పత్నీ ఔర్ పంగా – జోడియోన్ కా రియాలిటీ చెక్ (Pati Patni Aur Panga – Jodiyon Ka Reality Check ) అనే ఒక షో కలర్స్ టీవీలో రీసెంట్ గానే ప్రారంభమైంది. ఈ షో లో కొన్ని సెలబ్రిటీ జంటలు పాల్గొంటారు. వాళ్ల నిజ జీవితంలో జరిగిన అనుభవాలను, అనుభూతులను ఈ షోలో షేర్ చేసుకుంటారు.
ఈ షోలో అవికా గోర్ (Avika Gor)–మిలింద్ చంద్రవాణి (Milindh Chandravani) ఆకర్షణగా నిలిచారు. ఈ షో మొదలైనప్పుడు అవికా–మిలింద్ తమ రియల్ మ్యారేజ్ కూడా ఇక్కడే చేసుకుంటామని ప్రకటించారు. అలా ప్రకటించినప్పుడు అందరూ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నారు. కానీ చెప్పిన మాట ప్రకారమే వీళ్ళిద్దరూ ఈ షో లో ఒకటయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అవికా తెలుగు సినిమాల విషయానికి వస్తే, రాజ్ తరుణ్ (Raj Tharun) తో కలిసిన సినిమా చూపిస్తా మామా (cinema Chupistha Mama) సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది.
అయితే ఒకప్పుడు తెలుగులో కూడా ఇలాంటి షో ప్లాన్ చేశారు. వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరించారు. చందు మొండేటి, రాహుల్ రవీంద్రన్, మారుతి వంటి సెలబ్రిటీష్ వెన్నెల కిషోర్ షో కి హాజరయ్యారు. అయితే ఈ షో ఊహించిన స్థాయిలో పాపులర్ కాలేదు. అందుకే చాలామందికి ఈ షో గురించి పెద్దగా తెలియదు.
Also Read: Bigg Boss Promo: దివ్య ను టార్గెట్ చేశారా? ఆ కామనర్ దగ్గర హౌస్ మేట్స్ నిజంగానే తోలుబొమ్మలా?