Save the Tigers 3 : ఈ మధ్య ఓటీటీలోకి. సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లు మంచి క్రేజ్ ను అంటుకుంటున్నాయి. అందుకే వాటికి డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఈమధ్య మనం ఒకటో రెండో వెబ్ సిరీస్ లో మాత్రమే చూస్తున్నాము. అందులో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ అంటే సేవ్ ది టైగర్స్.. తెలుగులో రెండు పార్టులు గా వచ్చింది. తాజాగా ఈ సీజన్ 3 గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ సీజన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం…
ఈ వెబ్ సిరీస్ లో ప్రత్యేక పాత్రలో నటించిన ప్రియదర్శి లైఫ్ ఎక్కడికో వెళ్ళింది. తన ప్రత్యేకమైన నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మహి వి. రాఘవ్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శి పులికొండ, అభినవ్ గోమఠం, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమింగ్ చేయబడిన రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో మూడో సీజన్ పై కాస్త అంచనాలు ఎక్కువగానే క్రియేట్ అయ్యాయి.. ప్రియదర్శి సొంత ప్లాట్ కొనడంతో పాటుగా ఎమ్మెల్యే గా విన్నర్ అవుతాడు.. అదే విషయాన్ని ప్రియదర్శి ఓ పోస్ట్ తో బయటపెట్టాడు. అది కాస్త వైరల్ అవుతుంది.. మీరు ఆరాధించే వ్యక్తి ఘంటా రవి.. సేవ్ ది టైగర్స్ సీజన్ 3 త్వరలోనే రానుంది అని పేర్కొన్నారు.. కానీ షూటింగ్ అయిపోయిందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.. ప్రియదర్శి పోస్ట్ చేసిన ఫోటో చూస్తుంటే.. మూడో సీజన్ లో ఘంటా రవి ఎలక్షన్స్ లో గెలిచి ఎమ్మెల్యే అవుతాడని అర్థమవుతోంది. ప్రియదర్శి డ్రెస్సింగ్ స్టైల్, గన్ మ్యాన్, పీఏ.. ఈ సెటప్ అంతా చూస్తుంటే అదే అనిపిస్తోంది. ఇకపోతే త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..
Also Read : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
సేవ్ ది టైగర్స్ స్టోరీ చూస్తే.. తమ భర్తలను కాపాడుకుందాం అనే కామెడీ యాంగిల్‌లోనే సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బాగా తెరకెక్కించారు తేజ. సెకండ్ సీజన్ కూడా అలాగే వెళ్లిపోయాయి. ఈసారి భార్యలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు. తమ భర్తలు ఎదవలే కానీ మరి అమ్మాయిని ఏడిపించే అంత మూర్ఖులు కాదని భార్యలు తమ భర్తలని ఈ కేసు నుంచి బయట పడేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తారు. సీజన్ 3 లో ఎలాంటి ఎలాంటి స్టోరీ తో వస్తారో చూడాలి.. ఏది ఏమైనా కూడా ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు మూడో సీజన్ ఎలా అలరిస్తుందో చూడాలి..
The man you Adore – Ghanta Ravi #SaveTheTigers #Season3 #ComingSoon pic.twitter.com/s96yqvafPy
— Priyadarshi Pulikonda (@Preyadarshe) September 17, 2025