Alekhya sisters:అలేఖ్య చిట్టి పికిల్స్ బిజినెస్ తో అలేఖ్యతో పాటు అలేఖ్య ఇద్దరు సిస్టర్లు ఎంత ఫేమస్ అయ్యారో చెప్పనక్కర్లేదు.. అలాగే చిట్టి పికిల్స్ పేరుతో బిజినెస్ స్టార్ట్ చేసిన అలేఖ్య ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తో చాలా ఫేమస్ అయింది.తన పచ్చళ్లకు గిరాకీ ఎక్కువగా ఉండడంతోపాటు వాటి ధరలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి.దాంతో ఓ సామాన్య వ్యక్తి ఈ పచ్చళ్లను అంత ధర పెట్టి ఎలా కొంటాడు? అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టడంతో దాని కింద చాలా దారుణమైన బూతులతో అలేఖ్య రిప్లై ఇవ్వడంతో ఆ ఆడియో కాస్త సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యి దెబ్బకి చిట్టి పికిల్స్ బిజినెస్ మూత పడింది. అయితే అలేఖ్య.. పికిల్స్ బిజినెస్ ను కాస్త సమయం తీసుకొని మళ్లీ స్టార్ట్ చేసింది.
చిట్టి పికెల్స్ తో భారీ పాపులారిటీ..
ఇదిలా ఉంటే అలేఖ్య తో పాటు ఆమె ఇద్దరు సిస్టర్లు సుమ, రమ్య వీరిద్దరూ కూడా సోషల్ మీడియా లో ఫేమస్ అయ్యారు. ఇందులో సుమా తన సాఫ్ట్వేర్ కంపెనీలో వ్లాగ్స్ చేస్తూ మొదట ఫేమస్ అయింది. ఆ తర్వాత ఈమె కూడా సుమీ కలెక్షన్స్ పేరుతో సారీస్ బిజినెస్ స్టార్ట్ చేసింది. రమ్య విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో తన హాట్ హాట్ అందాలను అరబోస్తూ, తన జిమ్ బాడీతో కూడా అలరిస్తుంది. ముఖ్యంగా జిమ్ లో ఎక్సర్సైజ్లు చేస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకి సెగలు పుట్టిస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మకు సంబంధించి తాజాగా ఒక విషయం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది.
ALSO READ:Pawan Kalyan : ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ జంధ్యం చూశారా… దేంతో చేశారంటే ?
కుక్కలకి, ఆవులకి జీవితం అంకితం అంటున్న చిట్టి సిస్టర్..
అదేంటంటే..రమ్య మోక్ష ఇంస్టాగ్రామ్ ఖాతాలో నా ఈ జీవితం కుక్కలకి, ఆవులకి అంకితం అని పెట్టుకుంది. అయితే ఇది చూసిన నెటిజన్లు ఇదేంటి.. ఎవరైనా జన్మనిచ్చిన అమ్మా నాన్నలకి లేక తన భర్తకి, లేక సమాజానికి.. రాజకీయాలకు..ఇలా తమకు ఇష్టమైన వాటికి తమ జీవితం అంకితం అని రాసుకుంటారు. కానీ రమ్య ఏంటి కుక్కలకి, ఆవులకి నా జీవితం అంకితం అని రాసింది అని చాలామంది షాక్ అవుతున్నారు. ఇంక మరి కొంతమందేమో రమ్య జంతు ప్రేమికురాలు కావచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది జీవితంపై విరక్తి పుట్టిందా తల్లి.. అందుకే కుక్కలకు , నక్కలకు జీవితం అంకితం అంటున్నావ్ అంటూ సెటైరికల్ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం..
అవన్నీ రూమర్స్ మాత్రమే..
అలా ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారే రమ్య మరోసారి తన ఇంస్టాగ్రామ్ లో పెట్టుకున్న ఈ పోస్టుతో వైరల్ అవుతోంది. రమ్య మోక్షకి ఆ మధ్యకాలంలో బిగ్ బాస్. సీజన్ 9 లో ఆఫర్ వచ్చినట్టు రూమర్లు వినిపించాయి. కానీ ఈమెకు బిగ్ బాస్ 9లో అవకాశం రాలేదు. అలాగే యాంకర్ ఓంకార్ బ్రదర్ అశ్విన్ బాబు సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు కూడా రూమర్లు వినిపించాయి. కానీ ఇది కూడా రూమర్ గానే మిగిలిపోయింది.