E-Paper
Advertisement

Anee Master : జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

Anee Master : జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!
Advertisement

Anee Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్ గా, నేషనల్ అవార్డు గ్రహీతగా పేరు సొంతం చేసుకున్న జానీ మాస్టర్ (Jani Master)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ అనే తేడా లేకుండా వరుస భాషలలో అవకాశాలు అందిన ప్రతిచోట తన టాలెంట్ ను నిరూపించుకొని స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సొంతం చేసుకున్నారు. కన్నడలో మంచి విజయం అందుకున్న యువరత్న సినిమాకు గానూ నేషనల్ అవార్డు అందుకున్న ఈయన , అటు తమిళ్లో ధనుష్ నటించిన తిరుచిత్రాంబళం సినిమాకి కూడా నేషనల్ అవార్డు వరించింది. అయితే ఇప్పుడు ఈ అవార్డును క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే.

లైంగిక ఆరోపణల కేసులు జానీ మాస్టర్ అరెస్ట్..

Advertisement

అసలు విషయంలోకెళితే.. జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా ఆయన దగ్గర పనిచేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్ ఈయనపై లైంగిక వేధింపుల కేసులో కంప్లైంట్ చేసింది. తనపై 2017 నుంచి లైంగికంగా దాడి చేస్తున్నాడని, అవుట్డోర్ షూటింగ్ లో భాగంగా ముంబైకి వెళ్ళగా, అక్కడ బస చేసిన హోటల్లో తనపై అత్యాచారం చేశాడని, బహిరంగంగా ఇబ్బంది పెడుతున్నాడు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాదు తాను మైనర్ గా ఉన్నప్పటి నుంచే తనపై అత్యాచారం చేస్తున్నాడని, ఈ విషయం బయట పెడితే అవకాశాలు లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడని, పైగా తనను మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ చేస్తున్నాడంటూ బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. విచారణ చేపట్టిన నార్సింగ్ పోలీసులు ఆమె ఫిర్యాదు మేరకు ఇతడి పై పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. విచారణ అనంతరం రెండు వారాలపాటు చంచల్గూడా జైల్లో రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే జానీ మాస్టర్ కు జాతీయ అవార్డు ప్రకటించగా.. ఈ అవార్డును అందుకోవడం కోసం ఐదు రోజులు బెయిల్ కోరారు జానీ మాస్టర్. కానీ ఇలా అలిగేషన్స్ వచ్చిన నేపథ్యంలో జానీ మాస్టర్ కు తాత్కాలికంగా నేషనల్ అవార్డును నిలిపివేసింది జాతీయ అవార్డుల కమిటీ. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆయన బెయిల్ ను నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయాలపై మరో లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ (Anee Master)మాట్లాడుతూ.. జానీ మాస్టర్ మంచోడని, అతడి పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.

జానీ మాస్టర్ అరెస్ట్ పై ఫైర్ అవుతున్న ఆనీమాస్టర్..

Advertisement

తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె జానీ మాస్టర్ మంచితనాన్ని గుర్తుచేసుకుంది. ఆనీ మాస్టర్ మాట్లాడుతూ.. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు విషయం తెలిసి షాక్ అయ్యాను. వారం పాటు ఏమి తోచని స్థితిలో ఉండిపోయాను. అన్నీ తెలుసుకున్న తర్వాతనే మీడియా ముందుకొచ్చి మాట్లాడదామని అనుకున్నాను. అందులో భాగంగానే ఈరోజు మీడియా ముందుకు వచ్చాను. నేరం రుజువు కాకముందే ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవడం చాలా బాధాకరం. నేరం రుజువు కాకముందే అవార్డు కమిటీ తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. కనీసం హోల్డ్ లో అయినా పెట్టాల్సింది.ఆయన దగ్గర రెండేళ్లు పనిచేశాను. విదేశాలకు కూడా ఆయనతో కలిసి వెళ్ళాము. ఎప్పుడు కూడా ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎంతోమంది డాన్సర్లకు సహాయం కూడా చేశారు. అయితే అమ్మాయి విషయం కాబట్టి ఇప్పుడు ఎవరు స్పందించట్లేదు. వాస్తవానికి గతంలో జానీ మాస్టర్ మంచివాడు, గొప్ప వ్యక్తి అని మీడియా ముందు చెప్పిన అమ్మాయి ఇప్పుడు కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అంటూ ఆనీ మాస్టర్ తెలిపింది.

 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×