BigTV English

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

CJI Chandrachud Ayurveda: కరోనా సోకినప్పుడు అల్లోపతి చికిత్స అసలు తీసుకోలేదు.. సిజెఐ చంద్రచూడ్

CJI Chandrachud Ayurveda| ఆయుర్వేద, సంప్రదాయ చికిత్స చాలా గొప్పదని, కోవిడ్ సమయంలో తనకు ఆయుష్ తో అనుబంధం ఏర్పడిందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన హోలిస్టిక్ ఆయుర్వేద అరోహా 2024 (ఇంటర్నేషన్నల్ కాన్ఫెరెన్స్ ఆన్ అడ్వాన్స్ మెంట్స్ అండ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫర్ హోలిస్టిక్ ఆయుర్వేద) అనే అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. తనకు కోవిడ్ ఫస్ట వేవ్, సెకండ్ వేవ్ సమయంలో కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు అలోపతి మెడిసిన్ అసలు తీసుకోలేదని కేవలం ఆయుర్వేద చికిత్స తీసుకోవడంతోనే నయం అయిందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ఆయుర్వేద చాలా గొప్ప వైద్యం అని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.


సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ”ఆయుర్వేద అనే పదం రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. ఆయుర్ (జీవితం), వేదా (జ్ఞానం) అనే రెండు పదాలు కలవడంతో సంప్రదాయ ఆయుర్వేద చికిత్సకు నామకరణం జరిగింది. మానవ శరీరం, ఆలోచనలు, ఆత్మ ఒక సమతుల్యతలో ఉండేందుకు ఈ చికిత్స ఉపకరింస్తుంది. ప్రాకృతిక వైద్యం, సమతులమైన ఆహారం, వ్యాయామం, పాజిటివ్ ఆలోచనా విధానం ఆయుర్వేద చికిత్సా విధానంలో భాగం. ఆయుర్వేద చికిత్స, సంప్రదాయ జీవనశైలి విధానాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతాను. కోవిడ్ లాక్ డౌన్ సమయంలో అందరూ ఎంతో జాగ్రత్త వహిస్తూ జీవించారు. నాకు సెకండ్ వేవ్ సమయంలో సమయంలో కరోనా పాజిటివ్ అని తేలింది. అయినా నేను అలోపతి మందులు, చికిత్స అసలు తీసుకోలేదు. కానీ ఆయుర్వేద చికిత్సను నమ్ముకున్నాను.

Also Read: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..


శరీరాన్ని డిటాక్సిఫై చేయడం, లైఫ్ లో పాజిటివ్ గా ఉండడం.. ఆయుర్వేద మౌలిక సిద్ధాంతాలు. మనిషి సుదీర్ఘ కాలం ఆరోగ్యంగా ఉండాలన్నా, ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించాలన్నా ఈ నిమామాలను పాటించాలి. పరుగులు తీసే నేటి జీవన విధానంలో ఒత్తిడిని జయించడానికి , మెరుగైన జీవన ప్రమాణాలు సాధించడానికి ఆయుర్వేద ఎంతో ఉపయోగకరం. ఆయుర్వేద ప్రకారం.. ప్రతి వ్యక్తికి భిన్నమైన చికిత్స ఉంటుంది. ఇవన్నీ పాటిస్తే.. జీవితంలో, కెరీర్ లో విజయం సాధించవచ్చు.” అని ఆయన అన్నారు.

భారతదేశ ప్రభుత్వం ఆయుర్వేద చికిత్స ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు. దేశంలో ఆయుర్వేదకు పెరుగుతున్న డిమాండ్ కు తగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దీని కోసం ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎఐఐఎ) ఇంకా శ్రమించాల్సి ఉందని చెప్పారు.

ఆయుర్వేద వైద్య విద్యలో ఎఐఐఎ అందిస్తున్న పిజి, పిహెచ్ డి కోర్సు లు.. ప్రస్తుత ఆయుర్వే ద డాక్టర్లకు చాలా ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×