BigTV English

Animal movie new record : యానిమల్ మూవీ సరికొత్త రికార్డు .. ఏకంగా అన్ని గంటలే ..

Animal movie new record : యానిమల్ మూవీ సరికొత్త రికార్డు .. ఏకంగా అన్ని గంటలే ..
Animal movie new record

Animal movie new record(Latest news in tollywood) :

యానిమల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలనం నమోదు చేస్తూ దూసుకుపోతోంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వసూలు కురిపించడమే కాకుండా.. రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది. ప్రస్తుతం ఉన్న సినిమాలలోకి ఇంత హై పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసిన సినిమా ఇదే అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పటికి రిలీజ్ అయి 8 రోజులు అయినప్పటికీ ప్రతిచోట ప్రభంజనంలా రికార్డులు సృష్టిస్తూ కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే నార్త్ లో ఈ చిత్రం అనేక రికార్డులు నెలకొల్పింది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రం ఇంతవరకు ఎన్నడూ కనీ వినీ ఎరుగని సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది.


టి సిరీస్ ,భద్రకాళి పిక్చర్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కించిన యానిమల్ చిత్రం డిసెంబర్ 1న భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ బజ్ నెలకొనడంతో థియేటర్లు హౌస్ ఫుల్ అవ్వడంతో సునాయాసంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయినా దూకుడు ఏమాత్రం తగ్గించకుండా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబడుతుంది. ఒక్క హిందీ వర్షన్ సుమారు ఇండియా వైడ్ 550 కోట్లు వసూలు చేయగా మిగిలిన అన్ని భాషలలో కలిపి ఇప్పటికే 50 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.

ఇక ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి దేశంలోని అన్ని ప్రాంతాలలో ఈ చిత్రం భారీ స్పందన సొంతం చేసుకుంది. డిమాండ్ భారీగా పెరగడంతో అదనపు షోలు ప్రదర్శించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ సినిమా రిపీట్ ఆడియన్స్ ని భారీగా ఆకర్షించడం మరొక ప్రత్యేకత. ప్రస్తుతం ఈ సినిమాకి 24 గంటల పాటు ప్రదర్శించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టాక్. ప్రస్తుతానికి ఇది కేవలం బాలీవుడ్ వరకే అని తెలుస్తుంది. ఈ చిత్రానికి స్పెషల్ గా అర్ధరాత్రి ఒంటిగంటకు అలాగే రెండు గంటలకు ప్రత్యేకమైన షోలు ప్రదర్శించబోతున్నారట.ఇక తెలుగు అలాగే ఇతర భాషల్లో కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఇంకా ఈ విషయం పై ఎటువంటి స్పష్టత లేదు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×