BigTV English

Faf du Plessis : మళ్లీ  జట్టులోకి వస్తానంటున్న 39 ఏళ్ల డుప్లెసిస్ ..

Faf du Plessis : మళ్లీ  జట్టులోకి వస్తానంటున్న 39 ఏళ్ల డుప్లెసిస్ ..
Faf du Plessis latest news

Faf du Plessis latest news(Sports news headlines):


సౌతాఫ్రికా జట్టులో ఒక సమయంలో కీలకంగా ఉన్న మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసెసి మళ్లీ 2024 టీ 20 వరల్డ్ కప్ లో దేశం తరఫున ఆడతానంటూ స్టేట్మెంట్ ఇవ్వడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లపై దృష్టి పెట్టాడు. ఏ దేశంలోనైనా, అది ఏ లీగ్ మ్యాచ్ అయినా సరే, పిలిస్తే చాలు వెళ్లి ఆడుతున్నాడు.  ప్రస్తుతం అబుదాబిలో టీ 10 లీగ్ లు ఆడుతూ బిజీగా ఉన్నాడు. అక్కడ కూడా ఎడా పెడా ఫోర్లు, సిక్స్ లు బాదేస్తున్నాడు.

అయితే అధికారికంగా క్రికెట్ నుంచి ఇంకా రిటైర్ అయినట్టు ప్రకటించని డుప్లెసిస్.. టీ20 ప్రపంచకప్‌ సమయానికి జట్టు సమతూకాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. అప్పటికి నా అవసరం ఉందనిపిస్తే, తప్పకుండా బోర్డుని అడుగుతానని అన్నాడు.


2014,2016 టీ20 ప్రపంచకప్‌లలో సౌతాఫ్రికా జట్టుకు నాయకత్వం వహించాడు. 2020లో సౌతాఫ్రికా తరఫున చివరి టీ20 మ్యాచ్ ఆడాడు. 50 టీ 20 మ్యాచ్ లు ఆడి 1528 పరుగులు చేశాడు. 1 సెంచరీ, 10 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 143 వన్డేల్లో 5507 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి. 69 టెస్ట్ మ్యాచ్ లు ఆడి 4163 పరుగులు చేశాడు. 10 సెంచరీలు, 21 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.

అయితే ఐపీఎల్ లో ట్రాక్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది. మొత్తం 130 మ్యాచ్ లు ఆడి 4133 పరుగులు చేశాడు. 33 ఆఫ్ సెంచరీలున్నాయి. ఒకసారి 96 పరుగుల వద్ద అవుటై సెంచరీ మిస్ అయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా ఉన్నాడు. 2023 సీజన్ లో ఆర్సీబీ తరఫున 14 మ్యాచ్ లు ఆడి 730 పరుగులు చేసి రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డ్ టెంప్టింగ్ గా ఉండటంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు డుప్లెసిస్ రిక్వెస్ట్ గురించి ఆలోచిస్తున్నట్టు సమాచారం.

అందుకు తగినట్టుగానే  టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసే జట్టుకోసం డుప్లెసిస్, క్వింటన్ డికాక్, రిలీ రోసోవ్ వంటి ఆటగాళ్ల పేర్లు పరిశీలిస్తున్నట్లు సౌతాఫ్రికా వైట్ బాల్ క్రికెట్ కోచ్ రాబ్ వాల్టర్‌ వెల్లడించాడు. ఈ నేపథ్యంలో డుప్లెసిస్ రీఎంట్రీ ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×