BigTV English

Tishaa Kumar Dies of Cancer: 20 ఏళ్లకే క్యాన్సర్‌తో మృతి చెందిన ‘యానిమల్’ నిర్మాత కూతురు

Tishaa Kumar Dies of Cancer: 20 ఏళ్లకే క్యాన్సర్‌తో మృతి చెందిన ‘యానిమల్’ నిర్మాత కూతురు
Tishaa Kumar Dies of Cancer: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, కోలీవుడ్ ఇలా వివిధ ఇండస్ట్రీలలో సెలబ్రిటీలు తుదిశ్వాస విడుస్తున్నారు. దీంతో తమ కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఈ ఏడాది హాలీవుడ్ మూవీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, టైటానికి యాక్టర్ ఇయాన్ గెల్డర్, దర్శకుడు హరి కుమార్‌, మాలీవుడ్‌కి చెందిన నటి కనకలతతో సహా మరికొంతమంది నిర్మాతలు, యాక్టర్లు, దర్శకులు, టెక్నికల్ రంగానికి చెందిన పలువురు వివిధ కారణాల వల్ల మృతి చెందారు.
ఇక ఇప్పుడు మరో విషాదం సినీ ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కృష్ణ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. యానిమల్ ప్రొడ్యూసర్‌లలో ఒకరైన కృష్ణ కుమార్ గారాల పట్టి.. ఆయన ఏకైక కుమార్తె తీషా కుమార్ చాలా చిన్న వయసులోనే అంటే 20 ఏళ్లకే కన్నుమూసింది. తీషా కుమార్ గత కొన్నాళ్ల నుంచి క్యాన్సర్‌తో భాదపడుతుంది. ఈ క్యాన్సర్ సమస్య కోసం తీషా కుమార్ జర్మనీలో అత్యాధునిక చికిత్స తీసుకుంటుంది.

Also Read: రెబెల్స్ ఆఫ్ కల్కి.. మరో యాక్షన్ విజువల్ వండర్ వీడియో రిలీజ్


కానీ పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు. జూలై 18న ఆమె కన్నుమూసింది. ఈ విషయాన్ని తీషా కుటుంబ సభ్యులు ఇవాళ (జూలై 19) తెలియజేశారు. దీంతో ఆమె మరణ వార్త విని అంతా షాకైపోతున్నారు. ఇంత చిన్న వయసులో క్యాన్సర్‌తో చనిపోవడమేంటని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఆమె మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కూతురిని కాపాడుకోలేకపోయామే అంటూ బోరున విలపిస్తున్నారు.

ఆమె మరణంపై ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఆమె పార్థివదేహాన్ని ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా బాలీవుడ్‌లో బడా నిర్మాణ సంస్థ టీ సిరీస్. దీన్ని భూషణ కుమార్ చూసుకుంటున్నాడు. అయితే ఆయనకు కృష్ణ కుమార్ వరుసకు చిన్నాన్న అవుతాడు. ఈయన ప్రస్తుతం టీ సిరీస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నాడు. కృష్ణ కుమార్ 1995లో బేవఫా సనమ్ అనే సినిమాలో కీలక పాత్రలో నటించి అదరగొట్టేశాడు. కానీ ఆ తర్వాత నటనకు బ్రేక్ ఇచ్చి నిర్మాతగా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ మంచి హిట్లు అందుకున్నాడు. ఇటీవలే ‘యానిమల్’ సినిమా తీసి మంచి లాభాలు పొందాడు.


Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×