E-Paper
Advertisement

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..
Advertisement

Bollywood Actress : అవును నిజమే. బాలీవుడ్ ఇండియాలోనే గొప్ప సినిమా ఇండస్ట్రీ. కానీ, ఇక్కడ చిన్న మార్పు. అది ఏంటంటే… బాలీవుడ్ గతంలో ఇండియాలోనే గొప్ప ఇండస్ట్రీ. ఇప్పుడు కాదు. ఇప్పుడు భారతీయ సినిమాలో ఏ ఇండస్ట్రీ టాప్ లో ఉంది అంటే… అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే పేరు టాలీవుడ్. అందుకే ఇప్పుడు అందరూ టాలీవుడ్ పై కన్నెశారు. ముఖ్యంగా బాలీవుడ్ వాళ్లు ఈ లిస్ట్ లో ముందున్నారు. ఇప్పటికే చాాలా మంది బాలీవుడ్ నటీనటులు తెలుగు సినిమాల్లో కనిపించారు. ఇక దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అయితే ఏకంగా రెండు సినిమాలకు హీరోయిన్ గా సైన్ చేసింది. అందులో ఒకటి దేవర మూవీ ఈ నెల 27న రిలీజ్ కాబోతుంది. మరొకటి రామ్ చరణ్ నుంచి రాబోయే చిత్రం RC16. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉండగా, ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీలోకి రాబోతుందట. ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

జాన్వీ కపూర్ హిందీలో చాలా సినిమాలు చేసింది. కొన్ని లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా ఉన్నాయి అందులో. అయితే ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. ఇప్పుడు తెలుగులో ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా జాన్వీ కపూర్ సినిమా చేస్తుంది. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటల శివ తారక్ తో ఈ దేవర సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు.

Advertisement

ట్రైలర్ రిలీజ్ అయ్యాకా ఈ మూవీపై కొన్ని ట్రోల్స్ వచ్చిన మాట వాస్తవమే. కానీ, సినిమా అయితే తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని తారక్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాగే, ఇదే మూవీలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు. దీంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తంగా జాన్వీ కపూర్ తొలి తెలుగు మూవీ భారీ విజయం దక్కించుకోబోతుంది అనే మాట ఇప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్టు ఉంది సార అలీ ఖాన్. జాన్వీ కపూర్, సార అలీ ఖాన్ మంచి ఫ్రెండ్స్. బాలీవుడ్ లో జాన్వీ ఉన్నప్పుడు పరిస్థితి ఏంటో సార అలీ ఖాన్ కి బాగా తెలుసు. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి వెళ్లిన ఫస్ట్ మూవీతోనే పాన్ ఇండియా గుర్తింపు తో పాటు ఓ భారీ హిట్ జాన్వీ చేతిలోకి వెళ్లబోతుంది. ఇక తాను కూడా తెలుగు ఇండస్ట్రీలోకి వస్తే ఇలాంటి హిటే వస్తుందని అనుకుంటుందట. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా, తెలుగు సినిమాలు చేయడానికి రెడీ అని చెప్పేసిందట.

Advertisement

ప్రస్తుతం వరుస పెట్టి కథలను వింటున్నట్టు సమాచారం. అతి త్వరలోనే సార అలీ ఖాన్ టాలీవుడ్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది. ఈమె తెలుగు ఇండస్ట్రీలోకి వస్తే, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, తారక్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలకు బాగా సెట్ అవుతుందని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. చూడాలి మరి సార అలీ ఖాన్ ఫస్ట్ తెలుగు మూవీ ఏ హీరోతో ఉంటుందో…

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×