E-Paper
Advertisement

Naa Anvesh : లూకౌట్ నోటీసుల పై స్పందించిన అన్వేష్.. ఈ ** పీకలేరంటు వీడియో రిలీజ్..

Naa Anvesh : లూకౌట్ నోటీసుల పై స్పందించిన అన్వేష్.. ఈ ** పీకలేరంటు వీడియో రిలీజ్..
Advertisement

Naa Anvesh : ప్రముఖ యూట్యూబ్ నా అన్వేష్ పై రోజు రోజుకి వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా హిందూ దేవుళ్ళ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. దానిపై ఎంతో మంది హిందువులు ఆయన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేస్ ని ఫైల్ చేసిన పోలీసులు అతనికి నోటీసులు పంపించారు. అంతేకాదు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లకి కూడా నోటీసులు పంపించడంతో అన్వేష్ రెచ్చిపోతూ ఇటీవల ఓ ఇంస్టాగ్రామ్ వీడియోని పోస్ట్ చేశాడు. దాంతో అతనికి లుకౌట్ నోటీసులను పంపించారు పోలీసులు.. తాజాగా ఈ నోటీసులపై రియాక్ట్ అయ్యాడు యూట్యూబర్ అన్వేష్. ఈసారి మరింత రెచ్చిపోతూ ఓ వీడియోని రిలీజ్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం తెలుసుకుందాం..

అమ్మ బాబోయ్ అన్వేష్ బూతులు.. 

ప్రముఖ యూట్యూబర్ నా అన్వేష్ తనకి లుక్ అవుట్ నోటీసులు రావడం పై స్పందించారు. తాజాగా ఆయన తన ఇంస్టాగ్రామ్ లో వీడియోని రిలీజ్ చేశారు.. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన 89 కేసులు, కేసీఆర్ పై 9 కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై 19 కేసులు, జగన్మోహన్ రెడ్డి పై 29 కేసులు ఉన్నాయి. ఇవన్నీ వారి రాజకీయాల మీద ఎఫిడవిట్ ఆధారంగా ఇస్తారు. నా మీద ఇప్పటివరకు మూడు కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నానని వాళ్లు నామీద మూడు కేసులు పెట్టారు.. గోవాలో జరిగిన బెట్టింగ్ గ్యాంగ్ పై 41 రోజుల పోరాటం తర్వాత నాపై కేసు వేశారు. అది ఎటువంటి తలా తోక లేని కేసు కాబట్టి పెద్దగా నిలబడలేదు. ఇలాంటివి నాకు పెద్ద లెక్క కాదు. నాకు 8 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. ముగ్గురు సుప్రీంకోర్టు లాయర్లు ఉన్నారు. అలాగే ముగ్గురు హైకోర్టు లాయర్లు కూడా నా దగ్గర ఉన్నారు.. నా మీద మీరు ఎన్ని కేసులు పెట్టినా పెద్దగా భయపడను అని లోపలికి చేతులు పెట్టి నా ఈక కూడా పీకలేరు అంటూ చూపిస్తాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..

Advertisement

 

అన్వేష్ ను పోలీసులు అరెస్ట్ చేస్తారా..? 

అతనికి ఇండియాకు రావాలని నోటీసులు అందిన విషయం తెలిసిందే.. దానిపై కూడా స్పందించారు.. నేను ఇండియాకి వస్తాను కాకపోతే 2035 వరకు నా పాస్పోర్ట్ ఉంది. రెన్యువల్ చేయించుకోవడానికి అప్పుడు వస్తాను.. ఆ తర్వాత 140 దేశాలు తిరుగుతాను అంటూ అతను వ్యంగంగా చెప్పుకొచ్చాడు.. మరైతే ఒకవేళ అతను ఇండియాకు వస్తే అతని పోలీసులు అరెస్ట్ చేస్తారా..? లేదా అతనిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. ఒకవైపు అతనికి వ్యతిరేకత రోజురోజుకీ పెరుగుతున్న కూడా అతను మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఇంకా రెచ్చిపోతూ వీడియోలని పోస్ట్ చేస్తున్నారు. మరి పోలీసులు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో చూడాలి..

Advertisement

?igsh=MTg5YXZpNXgyOHg4Ng==

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×