E-Paper
Advertisement

Appudo Ippudo Eppudo Movie : అప్పుడెప్పుడో తీశారు… హీరో గారు పట్టించుకోని ఈ మూవీ దారెటో..!

Appudo Ippudo Eppudo Movie : అప్పుడెప్పుడో తీశారు… హీరో గారు పట్టించుకోని ఈ మూవీ దారెటో..!
Advertisement

Appudo Ippudo Eppudo Movie.. సాధారణంగా ఒక సినిమా తీస్తున్నారు అంటే అది థియేటర్లలోకి వచ్చేవరకు చిత్ర బృందం ఏ రేంజ్ లో కష్టపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే 24 ఫ్రేమ్స్ కూడా సినిమా కోసం కష్టపడాల్సి ఉంటుంది. అయితే ఒక్కోసారి అంత కష్టపడినా సరే ప్రేక్షకులకు కథ, కంటెంట్ నచ్చకపోతే కూరలో కరివేపాకు తీసేసినట్టు సినిమాను డిజాస్టర్ చేస్తారు. అందుకే ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని హీరోను మొదలుకొని తెరవెనుక పని చేసే కార్మికుల వరకు ప్రతి ఒక్కరు కూడా సినిమా ఔట్పుట్ బాగా రావాలని ఎంతో కష్టపడతారు. అయితే కొన్ని సినిమాలు అసలు ఎందుకు తీస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నిఖిల్ హీరోగా నటిస్తున్న “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”.. అసలు పసేలేని సినిమా ఇప్పుడు సడన్ గా ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమయ్యేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

కథ మొత్తం పెన్ డ్రైవ్ చుట్టే..

Advertisement

అసలు విషయంలోకి వెళితే.. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన నిఖిల్, ఆ తర్వాత విడుదల చేసిన 18 పేజెస్ పర్వాలేదు అనిపించుకుంది. కానీ ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్ జీవిత కథ లోని ఒక అంశాన్ని తీసుకొని స్పై పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth). ఈ సినిమా బొక్క బోర్ల పడింది. దీంతో అందరూ కార్తికేయ -3 కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సడన్గా నిఖిల్ ఈ సినిమాతో రావడం అందరిలో ఆశ్చర్యాన్ని గురి చేసింది. సాధారణంగా నిఖిల్ చాలా సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తాడు. అందులో భాగంగానే స్వయంభూ అనే పీరియాడిక్ మైథలాజికల్ మూవీలో నటిస్తున్నాడు ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు.కార్తికేయ -2′ తర్వాత నిఖిల్ నుంచి ఆ రేంజ్ లో రాబోయే చిత్రం ఇది అని అందరూ ఎదురు చూస్తుండగా సడన్గా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ” అప్పుడో ఇప్పుడో ఎప్పుడో” ( Appudo Ippudo Eppudo)అనే సినిమా నవంబర్ 8వ తేదీన విడుదలకు సిద్ధమయ్యింది. ఇదిలా ఉండగా ఈ సినిమా కథ మొత్తం పెన్ డ్రైవ్ చుట్టే తిరుగుతుందని ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

కరోనా సమయంలోనే సినిమా షూటింగ్ ప్రారంభం..

Advertisement

ఎప్పుడో కరోనా (Corona)సమయంలో ఈ సినిమాను మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు కూడా ఈ సినిమా గురించి ఎక్కడ వినిపించలేదు. దీనికి తోడు పైగా చాలాసార్లు ఈ సినిమా వాయిదా పడ్డది. దీంతో నిఖిల్ ఈ సినిమాను పక్కన పడేసి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అలా వచ్చిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి

సబ్సిడీతోనే నెట్టుకొచ్చారా..

ఇకపోతే ఈ సినిమాను దాదాపుగా లండన్ (London)లోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి లండన్ గవర్నమెంట్ ప్రకారం ఒక సినిమాను పూర్తిగా లండన్ లోనే చిత్రీకరిస్తే ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం ఆ సినిమాకు 50 నుండి 60 శాతం సబ్సిడీ కల్పిస్తుంది. దీనికి తోడు చిత్రానికి రిచ్ నెస్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇలా ఆలోచించిన దర్శక నిర్మాతలు ఒకవైపు సినిమా రిచ్ నెస్ ఉంటుందని , మరొకవైపు సబ్సిడీ కారణంగా డబ్బుకు డబ్బు వెనక్కి వస్తుందని ఆలోచించి ఈ సినిమాను అక్కడే తీసినట్లు తెలుస్తోంది..సబ్సిడీ కోసం సినిమా తీసి కక్కుర్తి పడిన దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమాను విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హీరో గారే పట్టించుకోని మూవీకి రిజల్ట్ ఏంటో..

ఎక్కడో మూలన పడేసిన సినిమాని మళ్లీ ఇప్పుడు ప్రేక్షకులలో బజ్ క్రియేట్ చేయడానికి నిఖిల్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడేమో అని అనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలి అంటే అసలు ఈ సినిమా తీస్తున్నట్టు ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అటు ఇండస్ట్రీలో దీనిపై ఎటువంటి బస్ లేదు. దీనికి తోడు బిజినెస్ జరగలేదు. హీరో సపోర్టు కూడా లేదు. అసలు ప్రమోషన్స్ ఎలా చేస్తారు.. ఇలాంటి సినిమా అని ఎవరికి అంటగడతారు ఇలా పలు అనుమానాలు ఆడియన్స్ లో కూడా తలెత్తుతున్నాయి. మరి ఇలా పసలేని సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తున్న నిఖిల్ కచ్చితంగా తన కెరియర్ పై నెగిటివ్ మార్కు వేయించుకుంటారేమో అని కూడా అభిమానులు ఆందోళన పడుతున్నట్లు సమాచారం.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×