BigTV English
Advertisement

Rahman – GV Prakash: ఈ మామ అల్లుళ్ళకు ఏమైంది.. సంథింగ్ ఈజ్ రాంగ్..!

Rahman – GV Prakash: ఈ మామ అల్లుళ్ళకు ఏమైంది.. సంథింగ్ ఈజ్ రాంగ్..!

Rahman – GV Prakash:ఆస్కార్ గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్(A.R.Rahman )విడాకులు తీసుకొని, అందరిని ఆశ్చర్యపరిచారు. 57 ఏళ్ల వయసు కలిగిన రెహమాన్.. ఈ వయసులో తన భార్యతో విడాకులు తీసుకోవడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెహమాన్ భార్య వయసు కూడా 50 సంవత్సరాలు. వీరి వివాహం జరిగి దాదాపు 29 ఏళ్లు పూర్తయింది. ఇక మరో నాలుగు నెలలు ఆగి ఉంటే 30 సంవత్సరాలు అయ్యింది. పైగా పెళ్లీడుకొచ్చిన ముగ్గురు పిల్లలు.. పెద్దమ్మాయికి 2022లో వివాహం జరిపించారు. చిన్నమ్మాయి చెఫ్ గా మారింది. ఇక కొడుకు సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో తన టాలెంట్ నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


వృద్ధాప్య వయసులో విడాకులు..

ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాల్సిన ఈ జంట విడిపోయి అందరిని ఆశ్చర్యపరిచారు. సడన్గా విడాకులు తీసుకుంటే పిల్లల పరిస్థితి ఏంటి? వారి భవిష్యత్తు ఏంటి ?అంటూ అభిమానులు అయోమయంలో పడ్డారు. ఇకపోతే సెలబ్రిటీలు ఇలాంటి విషయాలకి అసలైన కారణాలను బయట పెట్టరు. ఒకవేళ ప్రశ్నించినా సిల్లీ రీజన్స్ చెప్పి తప్పించుకుంటారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రెహమాన్ భార్య స్వయంగా తన లాయర్ ద్వారా తాము విడిపోతున్న విషయాన్ని ప్రకటించడం గమనార్హం. ఇక దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మధ్య గొడవలు ఇప్పుడే చల్లారే అవకాశం లేదు అంటూ సైరా భాను తరఫు న్యాయవాది ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


ఆరు నెలల వ్యవధిలోని మామ అల్లుళ్లు విడాకులు..

ఇదిలా ఉండగా ఏ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ కూడా ఆరు నెలల క్రితమే విడాకులు తీసుకున్నాడు. జీవీ ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితురాలైన సైంధవిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకి ఒక పాప కూడా ఉంది. 2013లో పెళ్లి చేసుకున్న వీరు 2024 మే నెలలో విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇకపోతే మామ అల్లుళ్లు ఇద్దరూ కూడా ఆరు నెలల వ్యవధిలో విడాకులు తీసుకోవడం.. సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. కెరియర్ లో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ మామ అల్లుళ్ళు ఇద్దరూ కూడా పర్సనల్ లైఫ్ లో ఫెయిల్ అయ్యారు అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు.

జీ.వీ.ప్రకాష్ కెరియర్..

జీ.వీ.ప్రకాష్ విషయానికి వస్తే.. సంగీత స్వరకర్తగా మంచి పేరు దక్కించుకున్న ఈయన గాయకుడు, నటుడు కూడా.. అలాగే చలనచిత్ర నిర్మాతగా కూడా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా తన సినీ కెరియర్ లో ఒక జాతీయ అవార్డు, మూడు ఫిలింఫేర్ అవార్డులతో పాటు మూడు సైమా అవార్డులు కూడా అందుకున్నారు. ఎన్నో చిత్రాలకు సంగీతం అందించి, భారీ పాపులారిటీ అందుకున్న ఈయన, తన మేనమామ అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. మేనమామ దగ్గర పలు చిత్రాలకు సంగీత విభాగంలో పనిచేసిన జీవి ప్రకాష్, కొద్దిరోజులు హ్యారిష్ జయరాజ్ వద్ద శిష్యరికం చేసి, ఆ తర్వాత సొంతంగా సంగీత దర్శకత్వం వహించడం ప్రారంభించారు. భారీ పాపులారిటీ అందుకొని ఇప్పుడు భార్యకి దూరమై ఒంటరిగానే కెరియర్ సాగిస్తున్నట్లు సమాచారం.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×