E-Paper
Advertisement

Rana Naidu 2: రానా నాయుడు మొదలు పెట్టాడు.. ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా

Rana Naidu 2: రానా నాయుడు మొదలు పెట్టాడు..  ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా
Advertisement

Rana Naidu 2: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కిన సిరీస్ రానా నాయుడు. నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మించింది. సుపర్ణ్ వర్మ, కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ గతేడాది మార్చ్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

అమెరికన్ టీవీ సిరీస్‌ రే డొనోవన్‌ కు రీమేక్‌ గా ఈ సిరీస్ తెరకెక్కింది. ఇందులో తండ్రీకొడుకులుగా వెంకీ, రానా నటించారు. ఫ్యామిలీ సినిమాలలో మాత్రమే కనిపించే వెంకటేష్.. ఇలాంటి బోల్డ్ సిరీస్ లో నటించడంతో చాలావరకు విమర్శలను అందుకున్నాడు. అయినా కూడా ఆ విమర్శలను లెక్కచేయకుండా వెంకీ.. రానా నాయుడు సీజన్ 2 కోసం రెడీ అయ్యాడు.

Advertisement

ఎప్పటినుంచో ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ ఉందని వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఇక ఎట్టకేలకు ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ మొదలయ్యింది. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈరోజు నుంచి రానా నాయుడు 2 షూటింగ్ మొదలయ్యిందని ఒక వీడియో క్లిప్ ద్వారా తెలిపారు. ఇందులో రానా యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్లు కనిపిస్తుంది.

ఇక ఈసారి వెంకీ, రానాలతో పాటు అర్జున్ రాంపాల్ కూడా చేతులు కలిపాడు. రానా నాయుడు.. ఈసారి అంతకు మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. మొదటి సీజన్ లో వెంకీ గతాన్ని పూర్తిగా చూపించలేదు. ఈసారి యాక్షన్ పార్ట్ మరింత ఎక్కువ ఉండనున్నట్లు తెలుస్తోంది. మరి ఈసారి బాబాయ్- అబ్బాయ్ లు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.

Advertisement

https://twitter.com/NetflixIndia/status/1815620831671648542

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×