BigTV English

Blackheads Removal Tips: బ్లాక్‌హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Blackheads Removal Tips: బ్లాక్‌హెడ్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఈ టిప్స్ మీ కోసమే

Blackheads Removal Tips: ప్రస్తుతం చాలా మంది బ్లాక్‌హెడ్స్ సమస్యను ఎదుర్కొంటున్నారు. వీటిని పోగొట్టుకోవడం నిజంగా అంత సులువైన పనికాదు. ఎంత ప్రయత్నించినా బ్లాక్ హెడ్స్ సమస్యను శాశ్వతంగా కూడా నయం చేసుకోలేరని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు, పద్ధతులతో వీటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మార్కెట్లో బ్లాక్ హెడ్స్ తగ్గించే చాలా రకాల క్రీములు దొరుకుతున్నాయి. కానీ అవి బ్లాక్ హెడ్స్‌ను తగ్గించడం పక్కన పెడితే మచ్చలు, ఇన్ఫెక్షన్లు, చికాకుతో పాటు ఇతర సమస్యలను తెచ్చిపెడతాయి. ఇంతకీ బ్లాక్ హెడ్స్ రావడానికి గల కారణాలు ఏంటి? వాటిని ఎలా తొలగించుకోవాలనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
బ్లాక్‌హెడ్స్ ఎందుకు ఏర్పడతాయి..
బ్లాక్‌హెడ్స్ అనగానే కేవలం కంటి బుగ్గలపై వచ్చే నల్లని ముచ్చలు అని అంతా అనుకుంటారు. కానీ నిజానికి బ్లాక్‌ హెడ్స్ అంటే కేవలం కళ్ల క్రింద మాత్రమే కాదు. శరీరంపై ఇతర భాగాల్లో కూడా చాలా చోట్ల ఇవి వస్తాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి కేవలం నల్లటి రంగులో మాత్రమే ఉండవు. చిన్న చిన్న మృత కణాలు మూసుకుపోయినప్పుడు ఏర్పడే మురికికి బయట గాలి దక్కడం వల్ల ఆక్సీకరణ చెంది నల్లగా కనిపిస్తుంది. ఇవే బ్లాక్‌హెడ్స్ గా ఏర్పడతాయి.
సాధారణంగా బ్లాక్ హెడ్స్ శరీరంలో నూనెల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న చోట ఏర్పడతాయి. ఎక్కువ మందికి ఇవి ముఖం చుట్టూ ఉండే గడ్డం ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి. అంతే కాకుండా పెదాల చుట్టూ, నుదురు, భుజాలు, వీపు ,ఛాతీ ప్రాంతాల్లో కూడా బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి.
వీటిని తొలగించడం ఎలా..
సాలిసిలిక్ యాసిడ్:
మార్కెట్లో లభించే క్లీనర్లలో ఉండే సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్‌లు చర్మంపై పేరుకుపోయిన చనిపోయిన చర్మ కణాలను విచ్ఛిన్నం చేస్తుంది . సాలిసిలిక్ యాసిడ్ ఫేస్ వాష్‌లను మీరు రోజుకు ఒకసారి మాత్రమే ఉపయోగించడం మంచిది. ఇది బ్లాక్ హెడ్స్ ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సాలిసిలిక్ యాసిడ్ వాష్‌లు మీ ముఖానికి వేళ ముఖానికి సూట్ అవుతుంది అని అనిపిస్తే ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. దీన్ని రెగ్యులర్‌గా వాడటం వల్ల ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.
ఎక్స్ఫోలియేషన్:
నిజానికి మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను ఎక్స్ఫోలియేషన్ పెద్దగా తగ్గించినప్పటికీ బ్లాక్ హెడ్స్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఆల్ఫా, బీటా ,హైడ్రాక్సీ యాసిడ్స్ కలిగిన పదార్థాలు బ్లాక్ హెడ్స్ సమస్యలు చక్కగా పరిష్కరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు చర్మాన్ని ఎక్స్ఫోలియెట్ చేసేందుకు ఉపయోగించే బ్రష్‌లు చాలా సున్నితంగా ఉండేలా చూసుకోవాలి. సున్నితమైన చర్మం కలిగిన వారు వీటికి కాస్త దూరంగా ఉండటం మంచిది.
మాస్క్:
చర్మపు రంధ్రాల్లో నుంచి దుమ్ము, ధూళి కణాలు, నూనె వంటి వాటిని తొలగించడంలో మాస్క్‌లు చాలా బాగా పనిచేస్తాయి. ఇందులో ఉండే సల్ఫర్ చనిపోయిన మృతకణాలను తొలగించి చర్మాన్ని అందంగా తయారు చేస్తుంది. అంతే కాకుండా జడ్డును తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.


Also Read: జుట్టు రాలుతుందా.. అయితే మీలో ఈ లోపం ఉన్నట్లే..

మేకప్ ప్రొడక్ట్స్:
బ్లాక్ హెడ్స్ సమస్యని తగ్గించుకోవాలంటే మేకప్ ప్రోడక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఉపయోగించే పదార్థాల్లో కోమెడోజెనిక్ లేకుండా చూసుకోవాలి . అలాగే రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా మేకప్ తొలగించి ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ రాకుండా ఉంటాయి.


Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×