Big Stories

Arjun Reddy Heroine: ఇంట్లో నుండి పారిపోయి, స్టార్‌ హీరోయిన్‌గా..?

Arjunreddy Movie Heroine Shalini Pandey Run Away From Home For Movies: సినీరంగం అనేది ఓ రంగుల ప్రపంచం.ఈ రంగుల ప్రపంచానికి రావాలని నటీనటులుగా ఎదగాలనే కోరిక వారిని నిద్ర పోనివ్వదు. ఇందుకోసం చాలామంది ఇంట్లో వారికి చెప్పకుండా సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇందుకోసం చాలామంది చాలా రకాల ఇబ్బందులకు గురవుతుంటారు.అందులోనూ కొందరికి లక్‌తో ఆఫర్లతో అక్కడే నిలదొక్కుకుంటారు. మరికొందరు అయితే ఎంతగా ట్రై చేసినా సరే ఇండస్ట్రీలో నిలదొక్కులేకపోతుంటారు.అందులో ఈ హీరోయిన్ కూడా ఎంట్రీ ఇచ్చింది.ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసా.? తనే అర్జున్ రెడ్డి బ్యూటీ షాలిని పాండే.షాలిని పాండే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.

- Advertisement -

ఈ అందాల ముద్దుగుమ్మ.. ఒకే ఒక్క మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ని సంపాదించుకుంది. ఆ తర్వాత మెయిన్‌ లీడ్‌ రోల్స్ కాకుండా సెకండ్‌ హీరోయిన్ కనిపించింది. అలాగే తన మూవీస్ ఎంపిక చేసుకునే విధానంలో సరైన ప్లానింగ్‌ లేక మూవీ ఆఫర్లను అందుకోలేకపోయింది. ముఖ్యంగా హీరోయిన్ అంటే అందం,అభినయంతో ఆడియెన్స్‌ హృదయాలను దోచుకొని ఆ తర్వాత సినీ ప్రపంచం నుండి మధ్యలోనే కనుమరుగై పోతుంటారు.ఒకటి రెండు చిత్రాల్లో యాక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నప్పటికి ఛాన్స్‌లు లేక కనుమరుగవుతుంటారు.అదే కోవలోకి ఈ నటి వచ్చి చేరింది. షాలినీ పాండే ఇంజనీర్ కావాలని ఆమె తండ్రి కోరిక. కానీ ఈమెకి యాక్టింగ్‌పై ఇంట్రెస్ట్ ఉండటంతో ఎలాగైనా మూవీస్‌లో నటించాలని అనుకుంది.ఇందుకోసం ఇంట్లో నుండి పారిపోయి వచ్చానని ఓ ఇంటర్వ్యూలో తన పాస్ట్‌ గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ని రివీల్ చేసింది.

- Advertisement -

Also Read: పాన్‌ ఇండియా మూవీతో దూసుకొస్తున్న కిరణ్‌ అబ్బవరం

మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చేయాలని ఆశపడ్డారు. కానీ నాకు కుదరలేదు. ఆ తర్వాత నాకు సినిమాలపై ఇష్టంతో నాన్నకు చెప్పాను. కానీ ఆయన ససేమిరా అన్నారు. అందుకే ఇల్లు వదిలేసి పారిపోయి వచ్చాను. ముంబై వచ్చిన తరువాత కొందరు ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ కొన్ని కారణాల వల్ల అబ్బాయిలతో కలిసి రూంలో అద్దెకు ఉండాల్సి వచ్చింది. ఆ అబ్బాయిలే నా ఫ్యామిలీగా మారి మూవీస్‌లో యాక్ట్ చేసేందుకు నాకు సపోర్ట్‌గా నిలిచారు.ఇప్పటికి వారందరితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉందని ఈ భామ చెప్పుకొచ్చింది.

అర్జున్‌రెడ్డి మూవీ అనంతరం ఈ భామ మహానటి మూవీలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపించింది. అనంతరం ఎన్టీఆర్ కథానాయకుడు, 118, గొరిల్లా,ఇద్దరి లోకం ఒకటే, బాంఫడ్‌, నిశ్శబ్బంద, సైలెన్స్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేసి అందరి చేత హౌరా అనిపించింది. కానీ ఈ భామ బ్యాడ్ లక్ ఏంటంటే టాలీవుడ్‌లో ఛాన్సులు లేక వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన మహారాజ్ మూవీలోనూ నటించింది ఈ హీరోయిన్. అయినా సరే టాలీవుడ్‌ ఇండస్ట్రీ మాత్రం ఈ భామపై కాస్త మొహం చాటేసిందనే చెప్పాలి. అందుకే ఈ భామ యూటర్న్‌ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ భామ మూవీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయి ఎక్కడ ఎండ్ అయిందంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News