BigTV English

Artist Hema Released Video: నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు: నటి హేమ!

Artist Hema Released Video: నేను హైదరాబాద్ లోనే ఉన్నాను.. నాకు ఏ రేవ్ పార్టీతో సంబంధం లేదు: నటి హేమ!

Artist Hema Released a Video related to Rave Party Busted in Bengaluru: బెంగళూరు ఎలక్ట్రానిక్ సినీ సమీపంలోని జీ.ఆర్ ఫామ్ హౌస్‌లో భారీ రేవ్ పార్టీ జరిగింది. ఈ రేవ్ పార్టీపై సిసిబి అధికారులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. అయితే వారు నిర్వహించిన ఈ రేవ్ పార్టీ దాడుల్లో ఓ తెలుగు నటి పట్టుబడినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో పాల్గొన్న నటిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ పార్టీలో ఆమెతో పాటు మరికొంతమంది నటులు కూడా రేవ్ పార్టీలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఆ స్పార్ట్‌లో ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే స్టిక్కరున్న కారును సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 17 ఎండీఎంఏ ట్యాబ్లెట్లు, అలాగే కొకైన్ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పార్టీలో దాదాపు రెండు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 100 మందికి పైగా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా ఇందులో 25 మందికి పైగా యువతులే ఉన్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ పార్టీని తెలంగాణకు చెందిన వాసు అనే వ్యక్తి నిర్వహించినట్లు చెబుతున్నారు. అయితే ఈ పార్టీలో సీనియర్ నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ కూడా ఉందని.. ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ వార్తలు బాగా వైరల్ కావడంతో నటి హేమ సోషల్ మీడియా ద్వారా స్పందించింది. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసింది. అందులో ‘‘నేను అన్ని ఆన్‌లైన్‌లోనూ ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. నా మీద ఫేక్ న్యూస్ వస్తుంది. నేను ఎక్కడికి వెళ్లలేదు. నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.


Also Read: బెంగుళూరులో రేవ్ పార్టీ, టాలీవుడ్ నటీనటులు, ఏపీ మంత్రి కారు కూడా..

ఒక ఫామ్ హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను. సో నా మీద వచ్చేదంతా ఫేక్ న్యూస్. ఆ పార్టీలో ఎవరు ఉన్నారు అనేది నాకు తెలియదు. అవన్నీ నమ్మొద్దు’’ అంటూ ఆ వీడియోలో తెలిపింది. దీంతో ఈ పార్టీకి ఆమె హాజరయ్యారు అనే వార్తలకు చెక్ పడింది. మరి ఈ పార్టీలో పాల్గొన్న ఆ నటీ నటులు ఎవరో తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×