Chicken Prices Hike in Andhra Pradesh and Telangana: సమ్మర్లో చికెన్ రేటు అమాంతం తగ్గిపోతుంది. కారణం.. సమ్మర్ హీట్ కి చికెన్ తినకూడదని భావిస్తారు. అలాగే వేడికి తట్టుకోలేక కోళ్లు చనిపోతుంటాయి. ఫలితంగా పౌల్ట్రీ వ్యాపారం కాస్త మందగిస్తుంది. వేసవి వేడి కాస్త తగ్గిందంటే చాలు.. చికెన్ ధరలకు రెక్కలొస్తాయి. కానీ ఇప్పుడు వేసవి ఇంకా వెళ్లకుండానే చికెన్ ధరలు పెరుగుతున్నాయి.
సామాన్యుడు కూడా ఒక రూ.100 పెట్టి తినే నాన్ వెజ్ చికెన్. మిగతా ఏ నాన్ వెజ్ చూసినా.. వందలు, వేల ఖరీదు ఉంటాయి. అంతపెట్టి తినే కంటే.. కాస్త చికెన్ వండుకుని తినడం మేలని భావించే వారు చాలామందే ఉన్నారు. కానీ ఇప్పుడా చికెన్ ధర కూడా పెరుగుతోంది.
వీకెండ్ వస్తే.. అందరూ చికెన్ షాపులవైపే చూస్తారు. ఒక్కోసారి చికెన్ షాపులు ఖాళీ కూడా ఉండవ్. బాగా రద్దీగా ఉంటాయి. అందరికీ ప్రియమైన చికెన్ ధర మరింత ప్రియం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రోజుకు వందల, వేల కేజీల చికెన్ విక్రయాలు జరుగుతాయి. బ్రాయిలర్, ఫారం ఇలా రకాలు కూడా ఉంటాయి. గత నెలలో రూ.250 ఉన్న చికెన్ ధర ప్రస్తుతం రూ.300కు చేరువవుతోంది.
Also Read: రికార్డు స్థాయిలో లాభాలు.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్ !
పౌల్ట్రీల నిర్వహణ ఖర్చు, కోళ్ల మేత ఖర్చులు పెరగడంతోనే.. చికెన్ ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ తో ధరతో పాటు.. కోడి గుడ్డు ధర కూడా 50 పైసల నుంచి రూ.1 మేర పెరిగింది. గత వారం ఒక గుడ్డు ధర రూ.5- రూ.5.50 ఉండగా.. ఈ వారం గుడ్డు ధర రూ.6 కు పెరిగింది. చికెన్ ధరలు పెరగడంతో.. వ్యాపారం తగ్గినట్లు వాపారులు వాపోతున్నారు. కిలో చికెన్ ధర రూ.250 ఉన్న సమయంలో ఒక్క జిల్లాలో 100 కేజీల వరకూ విక్రయాలు జరిగితే.. ఇప్పుడది 60-70 కేజీలకు తగ్గినట్లు సమాచారం. చికెన్, కోడిగుడ్డు ధర కూడా పెరగడంతో.. వినియోగదారులు ఇలాగైతే ఏం కొనాలి, ఏం తినాలని వాపోతున్నారు.