E-Paper
Advertisement

Hanuman Movie : విజువల్ వండర్ గా ఇండియన్ సూపర్ మ్యాన్ స్టోరీ .. హనుమాన్

Hanuman Movie : విజువల్ వండర్ గా ఇండియన్ సూపర్ మ్యాన్ స్టోరీ .. హనుమాన్
Advertisement
Hanuman Movie

Hanuman Movie : టాలీవుడ్ లో యంగ్ బడ్డింగ్ హీరో తేజ సజ్జ. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ ఇండియన్ సూపర్ హీరో అవతారంలో హనుమాన్ అనే మూవీ తో సంక్రాంతి బరిలోకి వస్తున్న విషయం తెలిసిందే. లాంగ్ బ్యాక్ ఎప్పుడో ఈ మూవీ నుంచి ఒక టీజర్ రిలీజ్ అయింది. ఈ చిన్ని టీజర్ మూవీ పై అంచనాలను భారీగా పెంచింది. దీంతో చిత్ర బృందం ఎప్పటికప్పుడు మూవీ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది. టైం తీసుకుని స్ట్రాంగ్ ,సాలిడ్ కంటెంట్ తో.. మంచి గ్రాఫిక్స్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సినిమాని సిద్ధం చేసింది.

సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ మూవీ లో.. ఈ యంగ్ హీరో అద్భుతం సృష్టిస్తాడు అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విడుదల కి నెల రోజుల ముందు నుంచే మూవీ టీం ప్రమోషన్స్ గట్టిగా మొదలు పెట్టేసింది. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా.. హనుమాన్ మూవీ మేకర్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి సూపర్ హీరో హనుమాన్ అనే పాటను విడుదల చేశారు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ఆ పాట అందరిని విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

రీసెంట్ గా డిసెంబర్ 19న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాదులోని..ఏషియన్ మహేష్ బాబు మాల్‌లో నిర్వహించబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ట్రైలర్ లో విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి అని టాక్. టీజర్ కంటే కూడా ట్రైలర్ డబల్ ఇంపాక్ట్ లో ఉందని.. మూవీ వీటన్నిటిని మించి సాలిడ్ గా ఉంటుందని తెలుస్తోంది. హనుమంతుడి వల్ల సూపర్ పవర్స్ వచ్చిన ఒక కుర్రాడు జీవితంలో ఎదుర్కొనే సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో  వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. వరల్డ్ వైడ్ జనవరి 12న ఈ మూవీ మొత్తం 11 భాషల్లో విడుదల కాబోతోంది. మరి సంక్రాంతి రేంజ్ లో సాలిడ్ గా ఈ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×