BigTV English

Ind vs Sa 3rd T20 : మూడో టీ 20లో రెండు మార్పులు?

Ind vs Sa 3rd T20 : మూడో టీ 20లో రెండు మార్పులు?
Ind vs Sa 3rd T20

Ind vs Sa 3rd T20 : సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ 20 సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ ఈరోజు జోహెన్స్ బర్గ్ లో జరగనుంది. మొదటి టీ 20 వర్షార్ఫణం అయిపోయింది. రెండో టీ 20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. ఇప్పుడు నిర్ణయాత్మకమైన మూడో టీ 20లో గెలిచి, సిరీస్ ని సమం చేయాలని చూస్తోంది. ఇది కెప్టెన్ గా సూర్యకుమార్ కి కూడా సవాల్ లాంటిదేనని చెప్పాలి. ఎందుకంటే ఇంతవరకు తాత్కాలిక కెప్టెన్ గానే తను వ్యవహరిస్తున్నాడు.


నిజానికి ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ని టీమ్ ఇండియా 4-1 తేడాతో విజయం సాధించింది. అయితే మూడు మ్యాచ్ ల అనంతరం సీనియర్ క్రికెటర్లు దాదాపు తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు.దాంతో ఆస్ట్రేలియా బీ టీమ్ తో భారత్ ఆడింది. సిరీస్ గెలవడానికి అది కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు. అయితే మొదటి రెండు మ్యాచ్ లు, సీనియర్స్ టీమ్ తోనే గెలిచింది కానీ, మూడోదాంట్లో ఓటమి పాలైంది.

ఈ పరిస్థితుల్లో సౌతాఫ్రికాతో జరిగే మూడో టీ 20లో తను కెప్టెన్ గా ప్రభావం చూపించకపోతే, మళ్లీ  జట్టులో సాధారణ సభ్యుడైపోతాడని అంటున్నారు. మళ్లీ సీనియర్లపై టీమ్ మేనేజ్మెంట్ ఆధారపడుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మూడో టీ 20లో రెండు మార్పులతో ఆడే అవకాశం ఉందని అంటున్నారు.


మొదట కులదీప్ స్థానంలో రవి బిష్ణోయ్ రావడం పక్కా అని తేలిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ ఆరోగ్యం కుదుట పడితే గిల్ స్థానంలో తను ఆడే అవకాశాలున్నాయి. అయితే ఒక మ్యాచ్ లో ఆడనంత మాత్రానా గిల్ ని ఇప్పటి నుంచే పక్కన పెట్టడం లాంటి సాహసాలు చేయకూడదని అంటున్నారు. భారత క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకున్న గిల్ కుదురుకున్నంత వరకు అవకాశాలు ఇవ్వాలని అంటున్నారు.

అలా చూస్తే యశస్వి జైశ్వాల్ కి ఎందుకన్ని అవకాశాలిస్తున్నారో అర్థం కావడం లేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ లో 5 మ్యాచ్ ల్లో కలిపి కేవలం 138 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. మరి తననెందుకు తెగ ఆడిస్తున్నారో అర్థం కావడం లేదని, అప్పుడే నెటిజనులు భగ్గుమంటున్నారు.  

అయితే జోహెన్స్ బెర్గ్ వేదికపై భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ 4 టీ20 మ్యాచులు ఆడిన టీమిండియా 3-1తో ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు అంచనా..
భారత్: రుతురాజ్ గైక్వాడ్/శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్

సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, మాథ్యూ బ్రీట్జ్‌కే,  ఎయిడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ఆండీ ఫెలుక్వాయో, నాండ్రే బర్గర్, తబ్రాజ్ షంసీ, లిజాడ్ విలియమ్స్, ఒట్నీల్ బార్ట్‌మాన్

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×