E-Paper
Advertisement

Aswani Dutt: మన బ్యానర్ లో అందరూ సినిమాలు చేసారు, ఒక ప్రభాస్ తప్ప అనుకున్న తరుణంలో ఇది జరిగింది

Aswani Dutt: మన బ్యానర్ లో అందరూ సినిమాలు చేసారు, ఒక ప్రభాస్ తప్ప అనుకున్న తరుణంలో ఇది జరిగింది
Advertisement

Aswani Dutt: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో అశ్విని దత్ ఒకరు. సినిమా మీద ఎంతో ప్యాషన్ తో సినిమా రంగంలో అడుగుపెట్టి, విశ్వవిఖ్యాత నట సౌర భౌమ ఎన్టీఆర్ తో సినిమాలు చేయటం మొదలుపెట్టారు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మూడు జనరేషన్ హీరోలతో కూడా సినిమాలు చేసిన ఘనత అశ్విని దత్ కు ఉంది. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలానే మెగాస్టార్ చిరంజీవితో చేసిన సినిమాలు అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఈ బ్యానర్ లో జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర, చూడాలని ఉంది మంచి సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో ఆడాయి.

అలానే చాలామంది యంగ్ హీరోస్ ను పరిచయం చేసిన ఘనత కూడా ఈ బ్యానర్ కి ఉంది. ఎన్టీఆర్ హీరోగా చేసిన శక్తి సినిమా ఈ బ్యానర్ కి తీవ్ర నష్టాలు తీసుకొచ్చింది. దాదాపు కెరియర్ ముగింపు దశకి వచ్చేసింది అనుకునే తరుణంలో అశ్విని దత్ కుమార్తెలు స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాను నిర్మించారు. చాలా చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాతోనే నాగ అశ్విన్ దర్శకుడుగా పరిచయమయ్యాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక అరుదైన దర్శకుడు దొరికాడు అని అనిపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత శ్రీ వైజయంతి బ్యానర్, స్వప్న సినిమాస్ బ్యానర్స్ దశ,దిశ రెండు మారిపోయాయి. మంచి క్వాలిటీ సినిమాలు రావడం మొదలయ్యాయి.

Advertisement

ఇక ఈ బ్యానర్ లో వచ్చిన మహానటి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు ఆడియన్స్ సినిమా ధియేటర్ కి రావడం మానేసారు అనుకునే తరుణంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి, ఈ సినిమా కోసం వెతుక్కుని మరీ వచ్చి చూసిన ఆడియన్స్ ఉన్నారు. ఇక ఇక్కడితో నాగ్ అశ్విన్ స్థాయి కూడా పూర్తిగా మారిపోయింది. సినిమా తర్వాత నాగ్ అశ్విన్ చేసిన సినిమా కల్కి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా 1150 కోట్లు వసూలు చేసింది. మైథిలాజికల్ సైన్స్ ఫిక్షన్ జానర్ లో వచ్చిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి.

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత అశ్విని దత్ మాట్లాడుతూ.. మూడు జనరేషన్ హీరోస్ తో కలిసి పని చేసాను. ఒక ప్రభాస్ తో పని చేయలేకపోయాను, అనుకునే తరుణంలో నాగి ఈ కథ చెప్పడం. వెంటనే ఈ కథ ప్రభాస్ కి నచ్చడం, తప్పకుండా చేద్దాం సార్ అని ప్రభాస్ చెప్పడంతో ఈ సినిమా మొదలైంది. ఈ సినిమా మంచి సూపర్ హిట్ అయింది. ఇక ప్రస్తుతం కల్కి సినిమా పార్ట్ 2 జరుగుతుంది అంటూ అశ్విని దత్ ఇంటర్వ్యూలో చెబుతూ వచ్చారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×