E-Paper
Advertisement

Game changer: ఎన్టీఆర్ గట్టెక్కాడు మరి రామ్ చరణ్ సంగతేంటి..?

Game changer: ఎన్టీఆర్ గట్టెక్కాడు మరి రామ్ చరణ్ సంగతేంటి..?
Advertisement

Game Changer.. సినిమా ప్రపంచంలో హీరోలందరూ కూడా స్నేహంగానే కలిసి ఉన్నట్టు బయటకు కనిపించినా, లోపల మాత్రం సినిమా కలెక్షన్ల విషయంలో ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటారు. ఒకరి వసూళ్ళను ఇంకొకరు క్రాస్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమాలో కలిసి నటించిన ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan) ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ రాజమౌళి స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సోలో హీరోలుగా ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమయ్యారు.

తొలిరోజే రూ .172 కోట్లకు పైగా కలెక్షన్స్..

Advertisement

అయితే ఎన్టీఆర్ దేవర (Devara)సినిమాతో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజే రూ.172 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించడమే కాదు నాన్ రాజమౌళి రికార్డులను కూడా బ్రేక్ చేశారు. అంతేకాదు దేశంలోనే అత్యధికంగా తొలిరోజు కలెక్షన్లు సాధించిన చిత్రంగా మూడవ స్థానాన్ని సంపాదించుకున్నారు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా ఈ చిత్రంలో నటించారు. దీనికి తోడు శృతి మరాఠీ , చైత్ర రాయ్ తదితరులు కూడా కీలకపాత్రలు పోషించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ విజయం సాధించడంతో వీరందరికీ కూడా మంచి పేరు లభిస్తోందని చెప్పవచ్చు

రామ్ చరణ్ కు టార్గెట్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్..

Advertisement

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన సినిమాతో రామ్ చరణ్ కి పెద్ద టార్గెట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game Changer) . ఈ సినిమా డిసెంబర్ 20 న విడుదల కాబోతోంది. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై బడా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.350 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రెస్టేజియస్ మూవీగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి ఇప్పుడు ఎన్టీఆర్ టార్గెట్ విధించారని చెప్పవచ్చు.

రామ్ చరణ్ టార్గెట్ బ్రేక్ చేస్తారా..

అసలు విషయంలోకి వెళ్తే , రాజమౌళి (Rajamouli)సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన తొలి చిత్రం దేవర , ఈ సినిమాతో తొలిరోజే రూ.172 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ టార్గెట్ ను రాంచరణ్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరో అయినా సోలో హీరోగా చేస్తే డిజాస్టర్ చవిచూస్తారు అనే సెంటిమెంట్ ఒకటి టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఆ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. మరి రామ్ చరణ్ ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా లేక బోల్తా పడతాడా అనే విషయం తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో ఊహకు మించని అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . మరి రామ్ చరణ్ ఏ విధంగా ఎన్టీఆర్ ఫిక్స్ చేసిన టార్గెట్ ను క్రాస్ చేసి, రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×