BigTV English
Advertisement

Aggipetti Macha: అగ్గిపెట్టె మచ్చ పై దాడి.. . స్పృహ తప్పి పడిపోవడంతో

Aggipetti Macha: అగ్గిపెట్టె మచ్చ పై దాడి.. . స్పృహ తప్పి పడిపోవడంతో

ఇదిలాఉంటే.. ఇటీవల అగ్గిపెట్టె మచ్చపై హైదరాబాద్‌లో కూడా దాడి జరిగింది. సినిమాలో ఛాన్స్ ఉందని.. షూటింగ్ పేరుతో అతడిని హైదరాబాద్ తీసుకు వెళ్లి నాలుగు రోజుల పాటు గదిలో నిర్బందించి.. చిత్రహింసలు పెట్టారని మీడియా ముందు వాపోయాడు. ఈ నెల 14న వైజాగ్ సత్య మూవీ షూటింగ్ ఉందని.. అగ్గిపెట్టె మచ్చను తీసుకు వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత తనను చాలా ఇబ్బంది పెట్టారని.. దీంతో తాను వాళ్ల దగ్గరి నుంచి తప్పించుకున్నానని, మీడియా ముందు అగ్గిపెట్టె మచ్చ చెప్పాడు. అక్కడ సరిగ్గా ఫుడ్ కూడా పెట్టలేదని, తనను ఫోన్ కూడా మాట్లాడనివ్వలేదని చెప్పాడు. అంతేకాదు తనను నాలుగు రోజులు పాటు గదిలో బంధించి, బాగా కొట్టారని చెప్పాడు. వాళ్లకు తెలియకుండా తన సోదరుడు శ్రీకాంత్‌కు ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చెయ్యలేదని చెప్పాడు.

ఆ తర్వాత తమ అత్త ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిందని తెలిపాడు. ఆమెకు చెబుతూ.. మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లారు. గదిలో బందించి బాగా కొట్టారని ఏడుస్తూ చెప్పాడు. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయాలని చెప్పానన్నాడు. ఆ తర్వాత తానే 100 కు ఫోన్  చేసి ఈ విషయాన్ని పోలీసులకు వివరించి.. ఆ తర్వాత వైజాక్ సత్య నంబర్ ఇచ్చానని మీడియాకు తెలిపాడు. వెంటనే పోలీసులు వైజాక్ సత్యకు ఫోన్ చేయగా అతను లిఫ్ట్ చేశాడు. తాము కుర్చీల ఆట ఆడమన్నాము.. ఆ సమయంలో ఆట ఆడకుండా డైరక్టర్‌ని కొరికేశాడని వైజాగ్ సత్య పోలీసులకు చెప్పాడు. అగ్గిపెట్టె మచ్చ సోదరుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఒకరు ఏమి అననిదే మా అన్న కలగజేసుకోడు అని చెప్పాడు.


Also Read: గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ చెప్పిన హీరో యష్..!

అగ్గిపెట్టె మచ్చకు ఫుల్‌గా తాగించి, బాగా కొట్టారని వైజాగ్ సత్య అబద్దం చెబుతున్నాడని శ్రీకాంత్ పోలీసులకు తెలిపాడు. దీంతో వైజాగ్ సత్య స్పందించాడు. తాము బిగ్ బాస్ పేరడీని “పెద్ద బాస్” అనే కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఐదు రోజుల పాటు షూటింగ్ అనుకున్నాం. ఇక్కడికి ఉప్పల్ బాలు, స్వాతీ నాయుడు, అగ్గి పెట్టె మచ్చ, రాకేష్ మాస్టర్ భార్య, తదితరులు పెద్ద బాస్ షోకి వచ్చారు. ఈ షోకి ప్రొడ్యూసర్ విజ్జి గౌడ్, యాంకర్ చందు నిర్వహిస్తున్నారు. మా అందరికి తక్కువ రెమ్యునరేషన్ ఉన్నా .. అగ్గిపెట్టె మచ్చకు మాత్రం ఎక్కువ డబ్బులు ఇప్పించానన్నాడు. అతనికి ఓ స్పెషల్ రూమ్ కూడా ఇప్పించామన్నాడు.  మందు, ఫుడ్ అన్ని ఏర్పాటు చేశాం.. కానీ అతను పుల్‌గా తాగేసి షూటింగ్‌కు సరిగ్గా రాకుండా తప్పించుకునే వాడు. దీంతో ప్రొడ్యూసర్ కి కోపం వచ్చి ఎంటీది.. ఇన్ని లక్షలు ఇచ్చి పెట్టాను సరిగ్గా కంటెంట్ ఇవ్వకపోతే ఎలా అని అడగగా.. ప్రొడ్యూసర్‌పై దూకి కొరికాడు.. రచ్చ రచ్చ చేశాడు. కుర్చీలు అన్ని పగలగొట్టాడు. దీంతో తమకు 40 లక్షల నష్టం వచ్చిందన్నాడు. దీంతో ఇబ్బంది ఎందుకులే అని తానే ఛార్జీకీ డబ్బులు ఇచ్చి.. అగ్గిపెట్టె మచ్చను పంపించాను అని వైజాగ్ సత్య పేర్కొన్నాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×