BigTV English

KGF 3 Update : గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ చెప్పిన హీరో యష్..!

KGF 3 Update : గూస్ బంప్స్ తెప్పించే న్యూస్ చెప్పిన హీరో యష్..!

KGF 3 Update : కన్నడ స్టార్ హీరో యష్ (Yash) ఒకప్పుడు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో కేజిఎఫ్ (KGF) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారో.. ఆ ఒక్క సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. వాస్తవానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ విడుదలైన మొదటి రోజే మొదటి ఆట ముగిసేసరికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బాస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఎవరు ఊహించని వసూలు రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో సీక్వెల్ కూడా ప్రారంభించారు. సీక్వెల్ గా కేజిఎఫ్ 2 అంటూ వచ్చి సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఊహించని రికార్డ్స్ క్రియేట్ చేసింది.


ఒక్క సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు..

అటు హీరోగా యష్ ఇటు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel)లకు మాత్రమే కాకుండా కన్నడ సినీ పరిశ్రమకు కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలోనే యష్ నుంచి వచ్చే మరో సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండగా.. ప్రస్తుతం టాక్సిక్ (Toxic) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇకపోతే కేజిఎఫ్ 2 ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎంత ఈగర్ గా అయితే ఎదురు చూశారో.. ఇప్పుడు కేజిఎఫ్ 3 (KGF 3) కోసం కూడా అంతే ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఒకవైపు టాక్సిక్ సినిమాపై అంచనాలు పెరుగుతున్నా.. మరొకవైపు కేజీఎఫ్ 3 కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గతంలో చిత్ర నిర్మాణ సంస్థ కేజీఎఫ్ 3 పై స్పష్టత ఇస్తూ.. ఒక వీడియో విడుదల చేసింది.’ రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉంటారు?’ అంటూ విడుదలైన ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా గూస్బమ్స్ తెప్పించే మరో వార్త వెల్లడించారు హీరో యష్.


కేజిఎఫ్ -3 పై బిగ్ అప్డేట్..

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఈయనకు కేజిఎఫ్ 3 గురించి ప్రశ్న ఎదురువగా.. యష్ మాట్లాడుతూ.. మేము వాగ్దానం చేసినట్లుగా కేజిఎఫ్ 3 ఖచ్చితంగా వస్తుంది. మాకు ఒక ఆలోచన ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి అధికారిక ప్రకటన చేస్తాము. చాలా భారీగా ఉంటుంది. అంటూ ఆయన తెలిపారు .అంతేకాదు ప్రేక్షకులు గర్వపడేలా చేస్తాము . ఎందుకంటే ఇది ఒక కల్ట్. నేను అలాగే ప్రశాంత్ దానిపై ఇప్పుడు చర్చిస్తున్నాము అంటూ కూడా తెలిపారు.

ఆస్కార్ బరిలో దిగడం ఖాయం..

మొత్తానికి అయితే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా పై అప్డేట్ ఇవ్వడంతో అభిమానులలో గూస్ బంప్స్ వస్తున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా కేజిఎఫ్ 3 కోసం అభిమానులు ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుంది. అసలు ఎప్పుడు షూటింగ్ ప్రారంభమవుతుంది అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో ఆస్కార్ బరి లోకి దిగడం ఖాయం అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×