BigTV English

Ayalaan: ‘అయలాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్‌ను అడ్డుకున్న షారుఖ్ ఖాన్.. కారణం ఇదే..!

Ayalaan: ‘అయలాన్’ తెలుగు వెర్షన్ రిలీజ్‌ను అడ్డుకున్న షారుఖ్ ఖాన్.. కారణం ఇదే..!
ayalaan telugu release

ayalaan telugu release(today tollywood news)

కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల తెలుగు విడుదలకు నోచుకోలేదు. కానీ తమిళంలో జనవరి 12న రిలీజై మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే తెలుగులో అప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి పోటీలో నిలవడంతో ఈ సినిమా విడుదల కాలేకపోయింది. ఆ తర్వాత జనవరి 26వ తేదీకి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేశారు.


ఈ సినిమాకు తమిళంలో పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి కలెక్షన్స్ రాబట్టడంతో తెలుగు వెర్షన్‌పై అందరిలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సైన్స్ ఫిక్సన్‌ మూవీగా తెరకెక్కడంతో అంచనాలు చాలానే ఉన్నాయి. ఇక జనవరి 26న రిలీజ్ కానుందని తెలపడంతో మూవీ యూనిట్ కూడా అలానే ప్రమోషన్స్ వేగవంతం చేసింది. అంతేకాకుండా ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కూడా ఈ మూవీ టెకెట్స్ భారీగా అమ్ముడుపోయాయి. తీరా చూస్తే.. జనవరి 26న ఈ మూవీ రిలీజ్ కాలేదు.

దీంతో షోలు క్యాన్సిల్ అయ్యాయని.. టికెట్ డబ్బులు వెనక్కి పంపించేస్తామని అందరికీ మెసెజ్‌లు వచ్చాయి. అనంతరం మూవీ వాయిదా పడింది అంటూ వార్తలు సాగాయి. అయితే ఈ మూవీ ఎందుకు వాయిదా పడింది అనేది మాత్రం బయటకు రాలేదు. ఇందుకు సంబంధించిన ఓ వార్త తాజాగా బయటకొచ్చి వైరల్‌గా మారింది. ఈ మేరకు ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోవడానికి గల కారణం ఏంటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


ఈ మూవీ తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోవడానికి కారణం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ వీఎఫ్ఎక్స్ పనులు అన్నీ ఆయనకు చెందిన రెడ్ చిల్లీస్ సంస్థ చేసిందట. అందువల్ల దీనికి సంబంధించిన డబ్బుల చెల్లింపుల విషయంలో వీరి మధ్య కొన్ని గొడవలు జరిగినట్లు సమాచారం.

ఈ కారణంగానే రెడ్ చిల్లీస్ సంస్థ వారు అయలాన్ మూవీ తెలుగు వెర్షన్‌ను నిర్మాతలకు ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ అర్ధంతరంగా ఆగిపోయినట్లు సమాచారం. ఇక ఇప్పట్లో ఈ మూవీ మరి థియేటర్లలో రాకపోవచ్చని.. డైరెక్ట్‌గా ఓటీటీలోకే వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×