BigTV English

Paper Cups : ఆ కప్పులో ‘టీ’ తాగుతున్నారా..!

Paper Cups : ఏ ఛాయ్ చటుక్కున తగరా భాయ్.. ఏ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపునా భాయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్.. అని మన మెగస్టార్ చిరంజీవి ఊరికే అనలేదు. ఛాయ్‌కి ఉన్న క్రేజ్ అటువంటిది..!

Paper Cups : ఆ కప్పులో ‘టీ’ తాగుతున్నారా..!

Paper Cups : ఏ ఛాయ్ చటుక్కున తగరా భాయ్.. ఏ ఛాయ్ చమక్కులే చూడరా భాయ్ ఏ ఛాయ్ ఖరీదులో చీపునా భాయ్ ఏ ఛాయ్ మనస్సుకీ మందురా భాయ్.. అని మన మెగస్టార్ చిరంజీవి ఊరికే అనలేదు. ఛాయ్‌కి ఉన్న క్రేజ్ అటువంటిది..!


పొద్దున్నే టీ కడుపులోకి పోనిది చాలా మంది చాలా మంది బెడ్ పైనుంచి కూడా లేవరు. పొద్దున్నే నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు టీ ఉండాల్సిందే. టీకి చాలా మంది అడిక్ట్ అయి పోయింటారు. ఇక టిఫిన్ చేయాగానే టీ, ఫ్రెండ్స్‌తో కలసినా టీ, మీటింగ్‌లకు వెళ్లినా టీ.. ఇలా వీలు దొరికినప్పుడల్లా ‘టీ’ తో ఛీర్స్ చేప్పేస్తుంటాం.

అయితే ఈమధ్య చాలా మంది టీ తాగేందుకు పేపర్ కప్స్ వాడుతున్నారు. బయట టీ పాయింట్స్‌లోనూ హోటళ్లలోనూ వీటినే వాడుతున్నారు. గాజు గ్లాసులు, పింగాణీ కప్పులను సరిగా శుభ్రం చేయకపోవడం ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కానీ పేపర్ కప్స్‌లో టీ, కాఫీలు తాగడం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.


మనలో చాలా మంది పేపర్ కప్ అనగానే పూర్తిగా పేపర్‌తో తయారు చేస్తారని భావిస్తాం. ఈ భావన పూర్తిగా తప్పు. కప్ పేపర్‌తో తయారు చేసినట్లయితే దాంట్లో వేడివేడి టీ పోసినప్పులు అలానే ఎలా నిలబడుతుంది..? కప్ అలా నిలబడి ఉండటానికి కారణం అందులో ఉండే ప్లాస్టిక్ లేయర్.

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పరిశోధనల ప్రకారం.. ప్లాస్టిక్ కప్స్‌లో వేడివేడి టీ, కాఫీ, పాలు పోసిన 15 నిమిషాల తర్వాత 25 వేల మైక్రాన్ సైజు ప్లాస్టిక్ పార్టికల్స్ వాటిలో కలుస్తున్నట్లు తేల్చారు. అయాన్స్, టాక్సిక్ హెవీ మెటల్స్ ఇందులో కలిసిపోతాయి.

ప్లాస్టిక్ కప్స్‌లో టీ, కాఫీలు మరేమైనా తాగటం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువని ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు గుర్తించారు. ఇలాంటి కప్పుల్లో టీ, కాఫీ, పాలు తాగడం కంటే మానేయడం చాలా మంచిది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×