E-Paper
Advertisement

Tollywood:ఇదేం బ్యాడ్ సెంటిమెంట్..దేవరా?

Tollywood:ఇదేం బ్యాడ్ సెంటిమెంట్..దేవరా?
Advertisement

Bad centiments trolling on junior NTR and Koratala Shiva combination Devara Movie

ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి రెండేళ్లవుతోంది. ఇంతవరకూ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశా నిస్పృహలతో ఉన్నారు. టీజర్లు, పోస్లర్లు ఆకట్లుకునేలా ఉన్నాయి. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వం దీనితో ఈ సినిమా అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి కానీ దేవర మూవీకి ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ నడుస్తోంది. ముఖ్యంగా హీరో, దర్శకుడు,సంగీత దర్శకుడు. ఈ ముగ్గురి గురించే కొంతమంది బ్యాడ్ సెంటిమెంట్ అవుతుందేమోనని భయపడుతున్నారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ నే తీసుకుంటే..రాజమౌళి సినిమాలో నటించాక వచ్చే ఏ సినిమా అయినా హీరోకి ఫ్లాప్ అవుతూ వస్తోంది. ఈ విషయంలో జూ.ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ తదితర హీరోలకు ఫ్లాపులొచ్చాయి. ఇప్పుడు ఫ్యాన్స్ ను అదే కలవరపెడుతోంది. సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాపయ్యాయి.

Advertisement

వెంటాడుతున్న ఆచార్య ఫ్లాప్

కొరటాల శివ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ మూవీలే. కాకపోతే చిరంజీవి హీరోగా తీసిన ఆచార్య దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది.బయ్యర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చిన ఈ మూవీ విషయంలో కొరటాల తీవ్ర డిజప్పాంయింట్ కు గురయ్యారు. సినిమా ఇండస్ట్రీ అంతా హిట్ సెంటిమెంట్ నే ఫాలోఅవుతుంటారు. అయితే ఆచార్య సినిమా ఎఫెక్ట్ కనిపించకుండా ఎలాగైనా ఈ సారి బ్లాక్ బస్టర్ ఇవ్వాలనే కసిమీద ఉన్నారు కొరటాల శివ. పైగా ఈ సినిమా విజయం కెరటాలకు చాలా ముఖ్యం. అటో ఇటో అయితే తన కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

భారతీయుడు 2 ట్రోలింగ్స్

ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ ని తీసుకున్నారు. అనిరుధ్ ట్రాక్ రికార్డు చూసినట్లయితే గతంలో స్ట్రయిట్ తెలుగు చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందించాడు. అయితే అవన్నీ ఫ్లాప్ అయ్యాయి. అజ్ణాత వాసి, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒక్క జెర్సీ మాత్రం హిట్ అయినా అందులో సూపర్ హిట్ అనిపించే పాటలు అందించలేకపోయాడు అనిరుధ్. పైగా ఇటీవల విడుదలైన కమల్ హాసన్ భారతీయుడు 2 కి అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీలో కూడా ఆకట్లుకునే పాటలు లేవు. పైగా భారతీయుడు సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. కమల్ హాసన్ నటించిన భారతీయుడు 1 మూవీకి అప్పట్లో ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇప్పటికీ ఆ మూవీ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయి. కానీ భారతీయుడు 2 మూవీలో ఒక్క పాటా జనం పాడుకునేలా లేవని..అందుకు కారణం అనిరుధ్ అని జనం ట్రోలింగ్స్ మొదలుపెట్టారు.

పాజిటివ్ గా స్పందిస్తున్న ఫ్యాన్స్

వాస్తవానికి సినిమా హిట్ అయితే ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్లన్నీ పట్టించుకోరు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన హీరో నటించిన దేవర తప్పకుండా ఇండస్ట్రీ హిట్ అవుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ గెటప్, బాడీ లాంగ్వేజ్ ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉన్నాయంటున్నారు. దేవర మూవీలో ఒకప్పటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్, జాన్వీల కెమెస్ట్రీ తప్పకుండా వెండితెరపై అలరిస్తుందని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇక ఈ మూవీలో ప్రతి నాయకుడుగా సైఫ్ ఆలీ ఖాన్ నటిస్తున్నాడు. సముద్రతీర ప్రాంతం బ్యాక్ డ్రాప్ కథాంశంగా కొరటాల ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నారు. ఎనీ హౌ ఈ మూవీకి బ్యాడ్ సెంటిమెంట్స్ అన్నీ పోయేలా మంచి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×