BigTV English

NEET paper scam CBI arrests key accused: నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్

NEET paper scam CBI arrests key accused: నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్

NEET paper scam CBI arrests key accused: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది మోదీ సర్కార్. ఎగ్జామ్ పేపర్ లీకై చాన్నాళ్ల తర్వాత కీలక నిందితుడ్ని సీబీఐ అరెస్ట్ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదంతా మోదీ సర్కార్ ఆడిస్తున్న డ్రామాగా వర్ణిస్తున్నాయి విపక్షాలు.


దేశవ్యాప్తంగా ఓ కుదుపు కుదిపేసింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వ్యవహారం. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తు చేస్తోంది. దీనికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది. దీంతో ఇప్పుటివరకు అరెస్టు అయిన వారి సంఖ్య 14కు చేరింది. తాజాగా అరెస్ట్ చేసినవారిలో సివిల్ ఇంజనీర్ పంకజ్‌కుమార్ కీలక సూత్రధారి గా భావిస్తోంది సీబీఐ. జాతీయ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన బాక్సు నుంచి పేపర్‌ లీక్ చేశాడట ఈయన.

పంకజ్‌కుమార్ అలియాస్ ఆదిత్య.. జంషెడ్‌పూర్ ఎన్ఐటీలో 2017 బ్యాచ్‌కు చెందిన సివిల్ ఇంజనీర్ స్టూడెంట్. ఎన్‌టీఏ‌కు చెందిన ఎగ్జామ్ బాక్స్ నుంచి పేపర్ దొంగిలించింది ఈయనేనని భావించి పాట్నాలో అదుపులోకి తీసుకుంది సీబీఐ. పేపర్ లీక్ నుంచి మిగతావారికి అందజేయడంతో సహకరించిన రాజుసింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు.


నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును ఓ కంట కనిపెడుతున్నాయి విపక్షాలు. బడ్జెట్ సమావేశా లకు ముందు కీలక నిందితుడ్ని అదుపులోకి తీసుకోవడంతో రీఎగ్జామ్‌కు పట్టుబట్టాలని విపక్షాలు భావిస్తు న్నాయి. ప్రభుత్వం అలసత్వం కారణంగా పేపర్ లీక్ అయ్యిందని, బాధ్యత కూడా కేంద్రమే వహించాల న్నది విపక్షాల మాట.

ALSO READ: నిజంగా నా కొడుకు తప్పు చేసుంటే ఉరి తీయండి: ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి

మరోవైపు ఎగ్జామ్ సక్రమంగా నిర్వహించేందుకు ఇస్రో మాజీ చీఫ్ రాధాకృష్ణన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఓ కమిటీ వేసింది జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ కమిటీ తన పని తాను చేసుకుపోతోంది. ప్రజల నుంచి సిఫార్సులు ఆహ్వానించింది. ముఖ్యంగా స్టూడెంట్స్, పేరెంట్స్, టీచర్, కోచింగ్ సంస్థల నుంచి దాదాపు 40 వేలకు పైగానే సూచనలు, సలహాలు అందాయి.

Tags

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×