E-Paper
Advertisement

Balakrishna – Boyapati Combo: బాలయ్య విత్ బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Balakrishna – Boyapati Combo: బాలయ్య విత్ బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్.. ఇక బాక్సాఫీసు బద్దలే..!

Nandamuri Balakrishna – Boyapati Combo Repeats: నందమూరి నటసింహం బాలయ్య బాబు.. ఈ పేరు వినగానే అభిమానులకు ఓ రీసౌండ్ వినిపిస్తుంది. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా మామూలు రేంజ్‌లో ఉండదు. రిలీజ్‌కు ముందే థియేటర్ల వద్ద ఓ రేంజ్‌లో సందడి చేస్తారు. అలాంటి బాలయ్య బాబు ఇప్పుడు పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ప్రస్తుతం ఒక మూవీ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘NBK 109’ వర్కింగ్ టైటిల్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది.

ఇందులో బాలయ్య ఫుల్ మాస్ యాక్షన్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్‌లో ట్రెండింగ్ అయ్యాయి. ఈ గ్లింప్స్‌తోనే సినిమాపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. ఇక ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత నాగవంశీ, సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ చిత్రానికి తన మాస్ బీట్స్ అందిస్తున్నాడు.

ఈ మూవీతో పాటు బాలయ్య బాబు లైన‌ప్‌లో ఇప్పుడు ఇంకో మూవీ సెట్ అయింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. అయితే వీరి కాంబో ఫిక్స్ కాబోతుందని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు జోరుగా సాగాయి. అయితే ఆ వార్తలు ఇవాళ నిజమయ్యాయి. జూన్ 10 అంటే ఇవాళ బాలయ్య బాబు బర్త్. ఈ సందర్భంగా బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో నాలుగో సినిమా అనౌన్స్ అయింది.

Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య.. బాబీ సినిమా టైటిల్.. ఇదిగో ఇదేనట!

‘‘#BB4’’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 14 రీల్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట కలిసి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇదంతా ఒకెత్తయితే ఈ బాలయ్య బాబు చిన్న కూతురు నందమూరి తేజస్విని ఈ చిత్రానికి సమర్పులుగా ఉండటం విశేషం. ఈ మూవీని అనౌన్స్ చేస్తూ మేకర్స్ తాజాగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.  ఈ పోస్టర్‌తో సినీ ప్రియులు.. అలాగే నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ మొదలైంది. మాస్ డైరెక్టర్, మాస్ హీరో సెట్ అయితే ఆ కిక్కే వేరప్ప అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ మూవీ అఖండ సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సీక్వెల్‌లో బాలయ్య బాబు నట విశ్వరూపం చూపించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు బోయపాటి భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×