E-Paper
Advertisement

Balakrishna and Chiranjeevi: బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం

Balakrishna and Chiranjeevi: బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్.. మెగాస్టార్‌కు ప్రత్యేక ఆహ్వానం
Advertisement

Nandamuri Balakrishna Golden Jubilee celebrations: టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా పరిశ్రమల్లోకి అడుగుపెట్టి 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1వ తేదీన హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ జరగనున్నాయి.

ఈ వేడుకకు తెలుగు సినిమా పరిశ్రమలోని అతిరథ మహారథులు హాజరుకానున్నారు. తాజాగా, ఈ వేడుకకు హాజరుకావాలని మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. అదే విధంగా నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించి చేస్తున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకున్నారు.

Advertisement

చిరంజీవిని ఆహ్వానించిన వారిలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్, రాజా రవీంద్ర, జెమినీ కిరణ్, కె,ఎల్. నారాయణ, మాదాల రవి, అనుపమ్ రెడ్డి, నిర్మాత సి కల్యాణ్, డైరెక్టర్ వీర శంకర్, నిర్మాత అశోక్ కుమార్, అనిల్ వల్లభనేని వీర శంకర్ తదితరులు ఉన్నారు.

Also Read: కల్కీ సినిమా బాలేదు.. ప్రభాస్ ఓ జోకర్‌లా ఉన్నాడు: బాలీవుడ్ యాక్టర్ షాకింగ్ కామెంట్స్

Advertisement

బాలకృష్ణ..‘తాతామ్మకల’ సినిమాతో తెలుగు తెరపై తొలిసారి దర్శనం ఇచ్చారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌లో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనుంది. ఆగస్టు చివరి వారం నుంచి జరగనున్న ఈ షూటింగ్‌లో బాలకృష్ణతోపాటు నటీనటులు పాల్గొననున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×