BigTV English

Balakrishna: బాబీ – బాలయ్య కాంబోలో మూవీ.. సినిమాకి అదే హైలెట్.. మాస్ జాతరే..!

Balakrishna: బాబీ – బాలయ్య కాంబోలో మూవీ.. సినిమాకి అదే హైలెట్.. మాస్ జాతరే..!

Balakrishna.. నటసింహం నందమూరి బాలకృష్ణ చివరిగా భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతకుముందు సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో నిలిచి భారీ విజయాన్ని అందుకున్న ఈయన , చివరిగా భగవంత్ కేసరి సినిమాతో కూడా మంచి విజయం అందుకున్నారు. ఇక ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. నిజానికి బాలకృష్ణ తన సినిమాలలో హ్యాట్రిక్ అందుకుంటూ బిజీగా మారగా.. మరొకవైపు రాజకీయాలలో కూడా వరుస విజయాలు ఆయనను తలుపుతడుతున్నాయి. 2024లో కూడా హిందూపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ముచ్చటగా మూడోసారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.


ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య..

ఇకపోతే వయసు మీద పడుతున్నా..యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోలలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన దాదాపు 50 సంవత్సరాల నుంచి సినీ ఇండస్ట్రీకి ఎనలేని సేవలు అందిస్తూ..ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలోని ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సినీ పరిశ్రమ ఈయనను అత్యంత గౌరవంగా సత్కరించింది కూడా. ఇకపోతే ఇప్పటికే బాలయ్య చేస్తున్న ప్రతి సినిమా కూడా ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలను అందుకుంటుంది. అంతేకాదు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా తెచ్చి పెడుతోంది. అందులో భాగంగానే బాబీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ.


బాలయ్య – బాబీ కాంబోలో అదే హైలెట్..

ప్రస్తుతం ఈ సినిమాపై కూడా అభిమానులు అంచనాలు పెంచుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే సినిమా కథ ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్ ని కూడా చిత్రీకరించారని, ఇదే ఈ సినిమాకి హైలైట్ అని, కనీసం ఈ సీన్ కోసమైనా సరే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్గా నిలవబోతోందని, ఇప్పటివరకు బాలకృష్ణ చేసిన సినిమాలు ఒకే ఎత్తైతే, ఇప్పుడు బాబి తో సినిమా చేస్తున్న సినిమా ఇంకొక ఎత్తు అని సమాచారం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

బాలకృష్ణ తదుపరి చిత్రాలు..

ఇకపోతే బాలయ్య తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలయ్య అఖండ -2 సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన, ఈ సినిమా సీక్వెల్ కూడా చేస్తామని అప్పట్లోనే ప్రకటించారు. కానీ ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు ఈ సినిమా ఉందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యం లో తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగు కి వెళ్ళబోతున్నారట. అఖండతో సంచలనం సృష్టించిన బాలయ్య ఆ సినిమా సీక్వెల్ తో మరెలాంటి విజయాన్ని అందుకుంటారో అని అభిమానులు కూడా క్యూరియాసిటీ గా ఎదురుచూస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×