BigTV English

Balakrishna NTR: ఎన్టీఆర్‌ని ప‌ట్టించుకోని బాల‌య్య‌.. పాపం అంటున్న నెటిజ‌న్స్‌.. వీడియో వైర‌ల్‌

Balakrishna NTR: ఎన్టీఆర్‌ని ప‌ట్టించుకోని బాల‌య్య‌.. పాపం అంటున్న నెటిజ‌న్స్‌.. వీడియో వైర‌ల్‌

Balakrishna NTR:నంద‌మూరి బాల‌కృష్ణ‌కు, ఎన్టీఆర్‌కు మ‌ధ్య దూరం మ‌ళ్లీ పెరిగిందా!.. ఎన్టీఆర్ కెరీర్ స్టార్టింగ్‌లో నంద‌మూరి కుటుంబం ఆయ‌న్ని ద‌గ్గ‌ర‌కు చేర్చ‌లేదు. అయితే త‌ర్వాత నెమ్మ‌దిగా ఎన్టీఆర్‌ను క‌లుపుకున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ ఆయ‌న‌తో ప్ర‌చారం చేయించుకున్నారు. అంతా బాగానే సాగుతూ వ‌చ్చింది. త‌ర్వాత ఏమైందో ఏమో కానీ ఎన్టీఆర్ టీడీపీ పార్టీ చాలా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. త‌న సినిమాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి ఎన్టీఆర్ అవ‌స‌రం ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. కానీ ఆయ‌న దాన్ని ప‌ట్టించుకోవ‌టం లేదు. ఇది బాల‌య్య‌కు న‌చ్చ‌లేదో ఏమో కానీ.. ఆయ‌న ఎన్టీఆర్‌తో ప‌ల‌క‌టం లేదు.


అందుకు రుజువేంట‌ని అడ‌గొద్దు.. ఎందుకంటే రీసెంట్‌గా నెట్టింట వైర‌ల్ అవుతున్న వీడియోనే కార‌ణం. గురువారం తార‌క‌ర‌త్న పెద్ద క‌ర్మ జ‌రిగింది. నంద‌మూరి కుటుంబ స‌భ్యులు, సెల‌బ్రిటీలు, స‌న్నిహితులు అంద‌రూ వ‌చ్చారు. ఓ సంద‌ర్భంలో నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌తో ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ కూర్చుని ఉండ‌గా అక్క‌డ‌కు బాల‌కృష్ణ వ‌చ్చాడు. ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్ రామ్ స‌హా అంద‌రూ లేచి నిల‌బ‌డ్డారు. అక్క‌డున్న వారిని ప‌ల‌క‌రించిన బాల‌య్య మాత్రం తార‌క్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌ను ప‌ట్టించుకోన‌ట్లే వెళ్లిపోయారు. ఇప్పుడా వీడియో తెగ వైర‌ల్ అవుతుంది. ఇత‌ర హీరోల అభిమానుల‌కు పాపం ఎన్టీఆర్ అని అంటున్నారు. అస‌లేం జ‌రిగిందో అక్క‌డి వారికే ఎరుక‌.

తార‌క‌ర‌త్న చ‌నిపోయాడ‌నే కార‌ణంగా ఎన్టీఆర్ త‌న 30వ సినిమాను కూడా వాయిదా వేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మార్చి 18న ప్రారంభించుకోబోతున్నారు.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×