BigTV English

Allu Arjun: ఐకాన్ స్టార్‌తో అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Allu Arjun: ఐకాన్ స్టార్‌తో అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ పాన్ ఇండియా మూవీ.. అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల ఎంపిక‌లో స్పీడు పెంచారు. కొన్నాళ్లుగా ఆయ‌న పుష్ప సినిమాకే ఎక్కువ స‌మ‌యాన్ని కేటాయించారు. ఈ గ్యాప్‌ను ఇంకా ఆయ‌న కొన‌సాగించాల‌ని అనుకోవ‌టం లేదు. అందుక‌నే కొత్త సినిమాను ఓకే చేయ‌ట‌మే కాకుండా దానికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న‌ను కూడా ఇచ్చేశారు. అర్జున్ రెడ్డి వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను తెలుగులో.. దాన్ని హిందీలో క‌బీర్ సింగ్‌గా రీమేక్ చేసి అక్క‌డ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగాతో మూవీ చేయ‌టానికి బ‌న్నీ ఓకే చెప్పేశారు. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌తో పాటు భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై భూష‌ణ్ కుమార్ , ప్ర‌ణయ్ రెడ్డి వంగా సినిమాను నిర్మిస్తున్నారు.


పుష్ప ది రైజ్‌తో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమాను పూర్తి చేయ‌టంలో బిజీగా ఉన్నారు. ఇది పూర్తి కాగానే సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఈ గ్యాప్‌లో సందీప్ వంగా.. మ‌న టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్రెస్టీజియ‌స్ మూవీ స్పిరిట్‌ను తెర‌కెక్కిస్తారు. ప్ర‌స్తుతం సందీప్ వంగా, బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్‌భీర్ క‌పూర్‌తో యానిమిల్ అనే సినిమాను రూపొందిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇన్‌టెన్స్‌గా సినిమాల‌ను రూపొందిస్తాడ‌నే పేరు సందీప్ రెడ్డి వంగాకు ఉంది. దీంతో అల్లు అర్జున్ సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని అనౌన్స్‌మెంట్ నుంచే అంద‌రిలోనూ క్యూరియాసిటీ పెరిగిపోతుంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×