E-Paper
Advertisement

Akhanda 2 Thaandavam: ఏంటి బాలయ్య .. కూతురు ముందే ఈ చిలిపి పనులు ..

Akhanda 2 Thaandavam: ఏంటి బాలయ్య .. కూతురు ముందే ఈ చిలిపి పనులు ..

Akhanda 2 Thaandavam: గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న హీరో బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. సినిమాల లైనప్ చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈ వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. 109 సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టుకున్నాడు. బోయపాటి శ్రీను , బాలయ్య కాంబో మరోసారి రిపీట్ కాబోతుంది. నిన్న అఖండ 2 కు సంబందించిన అనౌన్స్ మెంట్ ను ప్రకటించారు. అఖండ 2 సినిమాను పూజా కార్యక్రమాలతో చాలా గ్రాండ్ గా నిన్న లాంచ్ చేశారు. ఆ కార్యక్రమంకు సంబందించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య హీరోయిన్ తో చేసిన చిలిపి పని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో టేగ్ వైరల్ అవుతుంది ..

‘అఖండ 2’ గ్రాండ్ లాంచ్..

బాలయ్య , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో నాల్గవ సినిమాగా ‘అఖండ 2’ తెరకెక్కబోతోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ వంటి హ్యాట్రిక్ హిట్స్ తెరపైకి వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా ఒక దానికి మించి ఒకటి అన్నట్టుగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో నాలుగో మూవీ రాబోతుంది . గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండ కు సీక్వెల్  గా అఖండ 2 మూవీ రాబోతుంది. ‘అఖండ’ సీక్వెల్ అని అఫిషియల్ గా తెలిపారు. పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా, ఈ సినిమా ఓపెనింగ్ విశేషాలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. దానికి కారణం బాలయ్య ఇద్దరు కుమార్తెలు. గతంలో ఎప్పుడు తన కూతుర్లు ఏ ఒక్క సినిమాకు రాలేదు ఇప్పుడు రావడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద కూతురు నారా బ్రాహ్మణి క్లాప్ కొట్టగా, చిన్న కుమార్తె తేజస్విని నందమూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మూవీ ప్రారంభోత్సవంలో క్లాప్, స్విచ్ ఆన్ లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక బోయపాటి యాక్షన్ చెప్పగానే బాలయ్య అదిరిపోయే డైలాగ్ చెప్పారు.

హీరోయిన్ కు కూతురు ముందే ముద్దులు..

ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘అఖండ 2’ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా మొదటి పార్ట్ లో నటించిన ప్రగ్యా జైస్వాల్ కనిపించనుంది. ఇక ఈ మూవీ ఇటు బాలయ్యతో పాటు అటు బోయపాటికి కూడా మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కాబోతోంది. ‘అఖండ’ సినిమాకు పూనకాలు తెప్పించే మ్యూజిక్ అందించిన తమన్. అయితే ఈ కార్యక్రమానికి ప్రగ్య జైస్వాల్ వచ్చింది. కూతురు ఉందనే సంగతి పక్కన పెట్టి బాలయ్య హీరోయిన్ కు ముద్దుల వర్షం కురిపించాడు. ఆ సీన్ చూసి బ్రహ్మీణి సిగ్గు పడింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవ్వడంతో బాలయ్య పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×