BigTV English
Advertisement

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

BB4: పూజా కార్యక్రమాలకు ముహూర్తం ఫిక్స్.. ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా..!

BB4 Shooting : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati sreenu) కాంబినేషన్ కి ఎంత పెద్ద క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్లో మూడు సినిమాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాయి. ఈ సినిమాలతో హ్యాట్రిక్ కొట్టేశారు ఈ ద్వయం. అందుకే ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా ప్రకటించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.. దసరా పండుగ సందర్భంగా దుర్గామాత ఆశీర్వాదం తో BB4 అంటూ పోస్టర్ సహా విడుదల చేశారు. ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే పూజా కార్యక్రమాలకు కూడా ముహూర్తం ఫిక్స్ చేయడంతో ఇక మాస్ కాంబో మళ్లీ రిపీట్ అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


రామానాయుడు స్టూడియోలో ఘనంగా పూజా కార్యక్రమాలు..

ఇకపోతే సూపర్ హిట్ నటుడు నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రాబోయే నాలుగవ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఇకపోతే ఈ సినిమా పూజా కార్యక్రమాలను అక్టోబర్ 16వ తేదీన ఉదయం 10:00 గంటలకు రామానాయుడు స్టూడియోలో చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలా గ్రాండ్గా జరగబోతున్నాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే రామ్ అచంట , గోపీ అచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి బాలయ్య చిన్న కూతురు ఎం.తేజస్విని నందమూరి సమర్పకురాలుగా వ్యవహరిస్తోంది.


BB 4 కోసం ఆడియన్స్ వెయిటింగ్..

ఇకపోతే ఇప్పటికే బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సింహ, లెజెండ్, అఖండ వంటి మూడు బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. మూడు కూడా అభిమానులలో హైప్ పెంచడమే కాకుండా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. భారీ బడ్జెట్ తో అత్యంత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ఇప్పుడు ఈ బాలయ్య – బోయపాటి కాంబినేషన్లో నాలుగవ చిత్రం రాబోతోంది. ఇక ఈ మూవీ లాంఛ్ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే అఖండ -2 త్వరలోనే తెరపైకి తీసుకొస్తామంటూ గతంలో బాలయ్య – బోయపాటి ఇద్దరు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు అఖండ సినిమా సీక్వెల్ అఖండ -2 రాబోతోందా లేక వేరే ప్రాజెక్టా అన్నది తెలియాల్సి ఉంది.

సంక్రాంతి బరిలో బాలయ్య 109వ చిత్రం..

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో తన 109వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సరికొత్తగా బాలకృష్ణ సూపర్ హీరో గా నటించబోతున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎటువంటి విజయం అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకి పోటీగా చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుండగా, మరొకవైపు నాగార్జున వారసుడు నాగచైతన్య తండేల్ సినిమాతో సంక్రాంతి బరిలో దిగనున్నారు. మరి ఈ సంక్రాంతి హీరోగా ఎవరు నిలబడతారో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×