E-Paper
Advertisement

Devara: బ్రేకింగ్ .. దేవర సెట్ లో ప్రమాదం.. 20 మందికి గాయాలు.. ?

Devara: బ్రేకింగ్ .. దేవర సెట్ లో ప్రమాదం.. 20 మందికి గాయాలు.. ?
Advertisement

Devara: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్.. యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ తో కలిసి నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న దేవర అక్టోబర్ 10 న రిలీజ్ కానుంది.

అసలు ఏప్రిల్ 5 నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన దేవర ఆలస్యం అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా సెట్ లో ప్రమాదం జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. దేవర షూటింగ్ కొన్నిరోజులుగా అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జరుగుతుంది. ఎన్టీఆర్ లేని సీన్స్ ను షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఇక్కడ దేవర.. బాలీవుడ్ వార్ 2.. రెండు ఒకేసారి చేస్తున్న విషయం తెల్సిందే. ఇక కొరటాల శివ.. ఎన్టీఆర్ తో పోరాట సన్నివేశాలు ఫినిష్ చేసి ఆయన లేనప్పుడు మరికొన్ని సీన్స్ చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఆర్టిస్టులతో ఒక సీన్ చేస్తుండగా.. ఒక చెట్టుకు ఉన్న తేనెపుట్ట కదిలి.. అక్కడే ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ లపై దాడిచేసినట్లు సమాచారం. ఈ దాడిలో దాదాపు 20 మంది వరకు గాయాల పాలైనట్లు తెలుస్తోంది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారట. ముఖం, కాళ్లు, చేతులఫై తేనెటీగలు కుట్టడంతో బొబ్బలు తేలినట్లు చెప్పుకొస్తున్నారు. దేవర షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులు సైతం బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×