Big Stories

SSC CHSL 2024 Rigistration: ఇంటర్ అర్హతతో 3712 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

SSC CHSL 2024 Rigistration: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ మేరకు ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ ఆధ్వర్యంలో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ కేంద్ర సంస్థలు, మంత్రిత్వ శాఖలు, ట్రైబ్యునళ్లు, కార్యాలయాలు మొదలైన వాటిలో 3712 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్ ఏ) పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పూర్తి విరాలను విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీగా పేర్కొంది.

- Advertisement -

వయస్సు..

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అంటే 1997 నుంచి 2006 సంవత్సరం మధ్య పుట్టి ఉండాలి. ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు, దివ్యాంగులకు 10 నుంచి 15 సంవత్సరాల గరిష్ట వయస్సు సడలింపు ఉంటుంది.

అర్హత..

ఇంటర్ లేదా తత్సమాన కోర్సులు పూర్తి చేసి ఉండాలి. 2024 నాటికి 12 వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రి, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ, పోస్టులకు అర్హులవుతారు.

జీతం..

ఈ ఉద్యోగాలకు రూ. 19,900 నుంచి 63,200 జీతం ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు రూ. 25,500 నుంచి 81,100 గా ఉంటుంది.

పరీక్షా విధానం..

రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. టైర్1, టైర్2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో ఉంటుంది. టైపింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. పరీక్ష అనంతరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు. ఇతరులకు మాత్రం రూ.100గా ఫీజు నిర్ణయించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News