E-Paper
Advertisement

#BSS11: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త ప్రయోగం.. ఈసారి హర్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చేస్తున్నాడు

#BSS11: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త ప్రయోగం.. ఈసారి హర్రర్ మిస్టరీ థ్రిల్లర్‌తో వచ్చేస్తున్నాడు
Advertisement

Bellamkonda Sai Srinivas new movie: బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశాడు. కానీ అవేమి అతడికి అంత స్టార్డమ్ అందియ్యలేదు. అనంతరం ‘అల్లుడు అదుర్స్’తో మరొక హిట్ అందుకున్నాడు. ఇక అక్కడ నుంచి ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాడు. కానీ అందులో ఒక్క సినిమా కూడా బెల్లంకొండ శ్రీనివాస్ సినీ కెరీర్‌ను మలుపు తిప్పలేకపోయింది.

ఇక టాలీవుడ్‌లో అదృష్టం లేకపోవడంతో బాలీవుడ్‌కి చెక్కేశాడు. అక్కడ ఛత్రపతి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద పెద్దగా ఆడలేదు. దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బెల్లంకొండ కెరీర్‌కు మంచి కంబ్యాక్ అవుతుందని అందరూ భావించారు. కానీ అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఈ సినిమా ఫ్లాప్‌తో బెల్లంకొండ శ్రీనివాస్ మళ్లీ టాలీవుడ్‌లోకి వచ్చేశాడు.

Advertisement

ఇందులో భాగంగానే ఇప్పుడు వరుస సినిమాలను లైన్‌ పెట్టాడు. ఈ సారి ఎలాగైనా ఒక మంచి హిట్ కొట్టాలనే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతడి లైనప్‌లో ‘టైసన్ నాయుడు’ ఒకటుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

Also Read: భ‌గ‌వంత్ కేసరి సినిమా ప్రోడ‌క్ష‌న్‌లో బెల్లంకొండ‌ కొత్త సినిమా.. పోస్టర్ అదిరింది!

Advertisement

‘రాక్షసుడు’ సినిమాలో కలిసి నటించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నారు. ‘చావు కబురు చల్లగా’ సినిమా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో కొత్త సినిమాను ప్రకటించారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8లో తెరకెక్కుతోంది. #BSS11 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవాళ ఈ మూవీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది.

హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూలై 11 నుంచి స్టార్ట్ అవుతుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి బి.అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. త్వరలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×