E-Paper
Advertisement

Tyson Naidu Poster: భ‌గ‌వంత్ కేసరి సినిమా ప్రోడ‌క్ష‌న్‌లో బెల్లంకొండ‌ కొత్త సినిమా.. పోస్టర్ అదిరింది!

Tyson Naidu Poster: భ‌గ‌వంత్ కేసరి సినిమా ప్రోడ‌క్ష‌న్‌లో బెల్లంకొండ‌ కొత్త సినిమా.. పోస్టర్ అదిరింది!
Advertisement

Bellamkonda Sreenivas New Movie Tyson Naidu Poster: యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. తన తొలి మూవీ ‘అల్లుడు శ్రీను’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌లతో సినిమాలు చేశాడు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్‌లతో రొమాన్స్ చేశాడు.

అయితే బెల్లంకొండ మాత్రం ఎన్ని మూవీలు చేసినా పెద్దగా స్టార్ హీరో హోదాను మాత్రం దక్కించుకోలేకపోయాడు. ఎందుకంటే అతడు తీసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌‌గా మిగులుతున్నాయి కాబట్టి. అందువల్ల బెల్లంకొండ తెలుగు ఇండస్ట్రీకి కాస్త బ్రేక్ ఇచ్చి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Advertisement

ఇందులో భాగంగా స్టార్ అండ్ సీనియర్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో ‘ఛత్రపతి’ మూవీ చేశాడు. తెలుగులో ప్రభాస్ నటించిన ఈ మూవీని రీమెక్ చేసి హిందీలో అదే టైటిల్‌తో విడుదల చేశారు. అయితే ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది.

Also Read: బెల్లంకొండ శ్రీనివాస్‌కు జోడీగా ‘టిల్లు’ గాని హీరోయిన్..!

Advertisement

బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఇది నిరాశ మిగిల్చింది. అయితే ఇప్పుడు మళ్లీ ఈ హీరో తెలుగులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగానే సాగర్ చంద్ర దర్శకత్వంలో ‘టైసన్ నాయుడు’ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇందులో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా నేహాశెట్టి నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే బెల్లంకొండ ఈ సినిమాతో పాటు తన కెరీర్‌లో 11వ సినిమాను చేయడానికి ఇప్పుడు సిద్ధమయ్యాడు. నిన్న (ఏప్రిల్ 17) శ్రీరామనవమి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ వదిలారు.

Also Read: Mahesh Babu SSMB29: మహేశ్ బాబు, రాజమౌళి అలా నడిసొస్తుంటే ఉంది మావా.. వీడియో వైరల్

ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, కౌశిక్ పెగళ్లపాటి రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ అప్డేట్‌ అందించారు. ప్రస్తుతం ఆ పోస్టర్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలయ్య బాబు సినిమా ‘భగవంత్ కేసరి’ని నిర్మించిన షైన్ స్క్రీన్ ఇప్పుడు బెల్లంకొండ 11వ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి ‘కాంతార’ ఫేం అజనీష్ లోక్‌నాథ్ సంగీతం సమకూరుస్తున్నారు.

Image

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×