BigTV English

Bhagavanth Kesari : ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఆ 15 నిమిషాలు.. బాలయ్య యాక్షన్ సునామీ ..!

Bhagavanth Kesari : ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. ఆ 15 నిమిషాలు.. బాలయ్య యాక్షన్ సునామీ ..!
Bhagavanth Kesari

Bhagavanth Kesari : నందమూరి అభిమానులు దసరా పండగ కన్నా ఎక్కువగా ఎదురుచూస్తున్నది బాలయ్య సరికొత్త చిత్రం కోసమే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన మూవీ భగవంత్ కేసరి దసరాకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్, హై మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ చిత్రంతో మరొకసారి బాలయ్య బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడం కన్ఫామ్ అని ఫాన్స్ ఆశ పడుతున్నారు. బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాక 2021 లో విడుదలైన అఖండ చిత్రం అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది.


ఆ తర్వాత మొన్న సంక్రాంతి బరిలోకి వచ్చినప్పుడు వీర సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేసింది. ఇక రేపు దసరాకి వచ్చే భగవంత్ కేసరి.. తిరిగి బాక్స్ ఆఫీస్ ను బంతాట ఆడి.. బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ విజయాన్ని ఘనంగా నమోదు చేస్తుంది. అందరి అభిప్రాయం. ఇటు బాలయ్య తో పాటు అటు అనిల్ రావిపూడి కూడా ఈ చిత్రంతో డబల్ హట్రిక్ కొడతాడని అంచనాల్లో ఉన్నారు.

ఈ మూవీలో కాజల్ బాలకృష్ణ సరసన హీరోయిన్గా నటిస్తుంటే శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో చాలా ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తుంది.


ఈ మూవీలో శ్రీ లీల పాత్ర బలంగా ఉండడమే కాకుండా కథను మలుపు తిప్పే స్థాయిలో ఉంటుంది. ఒకరకంగా చెప్పాలి అంటే భగవంత్ కేసరి ప్రపంచం మొత్తం అతని కూతురు పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ చిత్రానికి తమన్ అందించిన మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మూవీ కి సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ గాసిప్ నందమూరి అభిమానులకు మంచి కిక్ ఇస్తుంది.

ఇంతకీ విషయం ఏమిటంటే భగవంత్ కేసరి మూవీలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా మొత్తానికి బలం చేకూర్చే విధంగా ఉంటుందట. ఇక మరీ ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఒక 15 నిమిషాలు బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు అని టాక్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు నీ గుండె లోతుల్లో నా ప్రాణం చేరింది పాట పాడుతూ ఉన్నప్పుడు బాలయ్య ఖైదీ యూనిఫాం వేసుకోని ఉండడం ట్రైలర్ లో అందరం గమనించాం. తన కూతుర్ని ఆర్మీ ఆఫీసర్ చేయాలి అని పడే తపన ట్రైలర్ లో చూసాం.

ఎక్కడ కనిపించని బాలయ్య పోలీస్ ఆఫీసర్ సీన్ ఎంత సస్పెన్స్ గా ఉంటుందో మరి. ఇంతకీ బాలయ్య ఆ 15 నిమిషాలు పోలీస్ ఆఫీసర్ గా ఎందుకు కనిపించాడో సినిమా చూస్తేనే అర్థమవుతుంది .అయితే ఆ గెటప్ లో ఉన్న 15 నిమిషాలు మాత్రమే బాలయ్య భీభష్టం సృష్టించాడట. సినిమా మొత్తానికి ఈ ఒక్క ఎపిసోడ్ సునామీ రేంజ్ సంచలనంగా ఉంటుందట. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయమే పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దశాబ్దాల క్రితం బాలయ్యను పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూసాం.. మళ్లీ తిరిగి పూర్తి పోలీస్ ఆఫీసర్ రేంజ్ లో బాలయ్య ఉంటే ఎలా ఉంటుందో చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. ఈ టాప్ గనుక నిజమైతే ఇంక సినిమా రచ్చ.. రచ్చ గా ఉండడం కన్ఫర్మ్.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×