BigTV English

Bharateeyudu 2: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందే.. భారతీయుడు యవ్వారం

Bharateeyudu 2: చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుందే.. భారతీయుడు యవ్వారం

Bharateeyudu 2: భారతీయుడు 2 సినిమా రిలీజ్ అనగానే.. ఒకపక్క శంకర్ ఫ్యాన్స్.. ఇంకోపక్క కమల్ హాసన్ ఫ్యాన్స్.. వీరు కాకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఎన్నో అంచనాలతో థియేటర్ కు వెళ్లారు. అయితే సినిమా పూర్తి అయ్యాకా వాడిపోయిన ముఖాలతో బయటకు వచ్చారు. శంకర్ మార్క్ ఎక్కడా కనిపించలేదని చెప్పుకొచ్చారు.


అసలు భారతీయుడును సరిగ్గా చూపించలేదని కొందరు.. కథ లేదని మరికొందరు.. లెంత్ ఎక్కువ అయ్యిందని ఇంకొందరు.. ఇలా మొదటి రోజే మిక్స్డ్ టాక్ కూడా కాకుండా నెగెటివ్ టాక్ ను చెప్పేశారు. దీంతో సినిమాపై ప్లాప్ ముద్ర పడిపోయింది. శంకర్ నుంచి ఇలాంటి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదని కొందరు చెప్పుకొస్తుంటే.. ఇదే ఇలా ఉందంటే.. రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్ ఇంకెలా ఉండబోతుందో అని ఇంకొందరు పెదవి విరుస్తున్నారు.

దాదాపు 3 గంటల సినిమాను చూడలేక ప్రేక్షకులు మధ్యలోనే లేచి వచ్చేస్తున్నారట. సాధారణంగా కథ నచ్చితే.. సినిమా డ్యూరేషన్ ను ఆడియెన్స్ అస్సలు పట్టించుకోరు. కానీ, ఈ సినిమా అలా లేకపోవడంతో మేకర్స్ తాము చేసిన పొరపాటును సరిదిద్దుకున్నారు.


తాజాగా  భారతీయుడు 2 సినిమా 3 గంటల నిడివిని  20 నిమిషాలు ట్రిమ్ చేశారట. సినిమాలో అవసరం లేని సీన్స్ ను కట్ చేసి 2 గంటల 40 నిమిషాలకు కుదించారు. రేపటి నుంచి థియేటర్ లో భారతీయుడు 2 అంతే డ్యూరేషన్ తో ప్రదర్శించనున్నారు. దీంతో కొంతవరకు నష్టాన్ని పూడ్చగలరని అనుకున్నారట మేకర్స్. అయితే ఇప్పటికే భారతీయుడు కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఇప్పటికే సినిమా నెగెటివ్ టాక్ అందుకోవడంతో.. సగానికి పైగా ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదేదో ముందే చూసుకొని అనవసరమైన సీన్స్ ను కట్ చేసి రిలీజ్ చేస్తే.. కనీసం ఫస్ట్ డే కలక్షన్స్ అయినా మంచిగా రాబట్టేది. ఇక చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ట్రిమ్ చేసాక సినిమాపై ప్రేక్షకుల ఒపీనియన్ మారుతుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×