BigTV English

Gautham Ghattamaneni: యాక్టింగ్ కోర్స్.. మహేష్ వారసుడు మొదలెట్టాడు

Gautham Ghattamaneni: యాక్టింగ్ కోర్స్.. మహేష్ వారసుడు మొదలెట్టాడు

Gautham Ghattamaneni: జనరేషన్ మారుతోంది. మరి కొత్త జనరేషన్ కు కొత్త హీరోలు కూడా రావాలి కదా. ప్రస్తుతం ఫ్యాన్స్ వారసుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాతలు అయ్యారు.. తండ్రులు చేస్తున్నారు.. ఇక ఇప్పుడు కొడుకుల మధ్య పోరుకు ఇండస్ట్రీ రెడీ అయ్యింది. టాలీవుడ్ స్టార్ హీరోల వారసుల మధ్య పోటీకి సమయం ఆసన్నమైంది. ఒకరు ఇద్దరు కాదు.. ముగ్గురు స్టార్ హీరోల కొడుకులు హీరోలుగా రెడీ అవుతున్నారు.


ఇప్పటికే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఖరారు అయిపోయింది. ఇక పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా ఎంట్రీ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వీరు కాకుండా ఈ రేసులోకి వచ్చేస్తున్నాడు ఘట్టమనేని వారసుడు గౌతమ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దులు తనయుడు గౌతమ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

చిన్నప్పుడే గౌతమ్.. వన్ నేనొక్కడినే సినిమాలో కనిపించి మెప్పించాడు. ఇక ఆ ఒక్క సినిమాలోనే అలా కనిపించిన గౌతమ్ ఆ తరువాత చదువుపై దృష్టి పెట్టాడు. విదేశాల్లో ప్లస్ 2 ను ఫినిష్ చేశాడు. ఇక ఇప్పుడు న్యూయార్క్ లో బ్యాచిలర్ డిగ్రీ చేయనున్నాడు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. దాంతో పాటు ఒక ప్రముఖ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్స్ కూడా చేయనున్నాడట. ఇప్పటికే గౌతమ్ ఫిజిక్ మీద ఫోకస్ చేస్తున్న విషయం తెల్సిందే.


ఇక ఇప్పుడు నటనలో కూడా శిక్షణ తీసుకోవడానికి రెడీ అవుతుండడంతో త్వరలోనే వారసుడు ఎంట్రీ ఉండనున్నట్లు అర్థమైపోయింది. నిజం చెప్పాలంటే.. సితార కన్నా గౌతమ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ. ఎప్పుడు కెమెరా కంటికి చాలా తక్కువ కనిపిస్తూ ఉంటాడు గౌతమ్. ఇది కూడా ఒకందుకు మంచిదే అని చెప్పాలి.

లుక్ మొత్తం చేంజ్ అయ్యాక గౌతమ్ ను చూపించాలనుకొనే ప్లాన్ లో మహేష్ దంపతులు ఉన్నట్లు టాక్. ఏదిఏమైనా సూపర్ స్టార్ ట్యాగ్ వచ్చాకా మహేష్ ను ఎవరు ప్రిన్స్ అని పిలవడం లేదు. ఇప్పుడు గౌతమ్ వస్తే.. ఆ ట్యాగ్ ను ఇవ్వడానికి ఫ్యాన్స్ సిద్ధమైపోయారు. మరి ప్రిన్స్ గౌతమ్ ఎంట్రీ ఎవరితో ఉంటుందో చూడాలి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×