E-Paper
Advertisement

Big Boss Telugu 7 : టేస్టీ తేజ వెల్ కమ్ ర్యాలీ.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం..

Big Boss Telugu 7 : టేస్టీ తేజ వెల్ కమ్ ర్యాలీ..  పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం..
Advertisement
Big Boss Telugu 7

Big Boss Telugu 7 : ప్రస్తుతం రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్- 7 బుల్లి తెరపై తెగ సందడి చేస్తోంది. ప్రస్తుతం షో 10వ వారంలోకి అడుగు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ టేస్టీ తేజ. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన తర్వాత తేజ అతని ఫాన్స్ తో కలిసి ఓ రేంజ్ లో రచ్చ చేశాడు. బ్రహ్మరథం పట్టిన ఫ్యాన్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి తేజ హౌస్ కు పెద్ద ర్యాలీగా బయలుదేరారు. ఈ గ్యాప్ లో పల్లవి ప్రశాంత్ అభిమానులు టేస్టీ తేజపై ఎదురుదాడికి దిగారు. చివరికి పోలీసులు రంగంలోకి దిగితే కానీ సమస్య పరిష్కారం కాలేదు .ఇంతకీ ఏం జరిగిందో తెలుసా?

ఈసారి బిగ్ బాస్ సీజన్ -7 పేరుకు తగ్గట్టుగానే మొత్తం ఉల్టా పల్టా కాన్సెప్ట్స్ తో ఆసక్తికరంగా సాగుతోంది. వరుసగా 5 వారాల నామినేషన్ తర్వాత 14 మంది కంటెస్టెంట్స్ నుంచి కిరణ్ రాథోడ్ , షకీలా , సింగర్ దామిని , రతిక రోజ్, శుభశ్రీ రాయగురు వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఐదోవారంలో కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. ఆ తర్వాత రతిక రోజ్ మళ్లీ హౌస్ లోకి తీసుకువచ్చి ఉల్టా పల్టా అంటూ కొత్త టాస్క్స్ మొదలు పెట్టాడు బిగ్ బాస్. కొత్తగా వచ్చిన నయని పావని, పూజా మూర్తి 5, 6 వారాల్లో ఎలిమినేట్ అయ్యారు. లాస్ట్ వీక్ ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వగా.. ఈ వీక్ టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాడు.

Advertisement

బయటకు వచ్చిన టేస్టీ తేజకు ఫ్యాన్స్ వీర లెవెల్ లో స్వాగతం పలికారు. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి కాకుండా విన్నర్ అయి వచ్చినంతగా ఫీల్ అవుతూ పెద్ద రేంజ్ లో ర్యాలీ నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోస్, ఫొటోస్ బాగా వైరల్ అయ్యాయి. చాలామంది ఫాన్స్ అన్న వదిన ఎట్లా ఉంది? అని కామెంట్స్ కూడా పెట్టారు. అయితే వాళ్లు శోభా శెట్టిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినా తేజ ఎప్పటిలాగా దీన్ని కూడా పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.

ర్యాలీ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పల్లవి ప్రశాంత్ ఫాన్స్ వచ్చి టేస్టీ తేజపై దాడి చేశారు. పోలీసులు కలగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోపక్క టేస్టీ తేజతో ఫోటోలు తీసుకోవడానికి ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపించారు. ఈ క్రమంలో టేస్టీ తేజ కారు ఎక్కి బయలుదేరుతూ మీడియాపై విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మరి బిగ్ బాస్ హౌస్ విషయానికి వస్తే ఈసారి దీపావళి బంపర్ గిఫ్ట్ కింద ఐదుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. ఈవారం దీపావళి ఎవరు ఇంట్లో జరుపుకుంటారో? ఎవరు బిగ్ బాస్ హౌస్ లో జరుపుకుంటారో? చూడాలి మరి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×