BigTV English

Manchu Family : బిగ్ బ్రేకింగ్.. మనోజ్ ను కలవనున్న విష్ణు.. 

Manchu Family : బిగ్ బ్రేకింగ్.. మనోజ్ ను కలవనున్న విష్ణు.. 

Manchu Family : టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేస్తున్న ఫ్యామీలలో మంచు ఫ్యామిలీ కూడా ఒకటన్న విషయం తెలిసిందే. వీరి ఇంట్లోని వారసులంతా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించారు. సినిమాల పరంగా అంతా ఒకే.. కానీ నిన్నటి నుంచి వీరి ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది . కుటుంబసభ్యులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మోహన్‌బాబు పై మంచు మనోజ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. తనపై మోహన్ బాబు దాడి చేశాడని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక గాయాలతోనే పోలీసుస్టేషన్‌కు మనోజ్ వచ్చారు. ఇటు మోహన్ బాబు కూడా మనోజ్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు ఆరోపిస్తున్నారు.. ఈ వివాదాం కాస్త ట్విట్టర్ వార్ గా మారింది. ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. కాసేపటిలో మంచు విష్ణు, మనోజ్ ను తన ఇంట్లో కలవనున్నారని సమాచారం..


ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త వచ్చినా, ఆ కుటుంబంలో ఎప్పుడు ఏం జరిగినా ఆ విషయాలు వెంటనే వైరల్ అయిపోతాయి. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో విభేదాలు అనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అసలు ఈ గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయా? మనోజ్ రెండో పెళ్లి చేసుకోవడంతో బయట పడ్డాయా? వంటి సందేహాలు జనాలకు రావడం కామన్.. మంచు మనోజ్ పెళ్లి విషయంలోనే ఆ ఫ్యామిలీ విభేదాలు వచ్చాయని, ఇప్పటికీ ఈ పెళ్లిని తన కుటుంబం ఒప్పుకోవడం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. . ఈ విషయంపైనే విష్ణుతో మంచు మనోజ్‌కు ఒకసారి గొడవ కూడా జరిగింది. ఇదిఇలా ఉండగా.. తాజాగా ఆస్తుల వ్యవహారంలో మోహన్ బాబుతో మంచు మనోజ్‌కు గొడవలు జరిగినట్లు వార్తలు నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి. అసలేం జరుగుతుంది? పోలీసుల వరకు వెళ్ళాల్సిన గొడవలు ఏం జరిగాయి అన్నది చర్చనీయాంశంగా మారింది.

మంచు ఫ్యామిలీకి సంబందించిన విద్యానికేతన్ సంస్థలో వినయ్ అనే వ్యక్తి కీలక పదవిలో ఉన్నాడు. అయితే మనోజ్‌కు, వినయ్‌కు మధ్య గొడవ మొదలుకాగా.. వినయ్‌తో పాటు తన రౌడీ మూక కూడా ఈ గొడవ మధ్యలో జోక్యం చేసుకొని మనోజ్‌పై దాడిచేశారు. ఇందులో మోహన్ బాబు ప్రమేయం కూడా ఉందని మనోజ్ ఓపెన్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అందుకే తన తండ్రితో పాటు వినయ్‌పై ఫిర్యాదు చేయాలని మనోజ్ అనుకున్నాడు. కానీ ఒక్కడే వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక తండ్రి, తమ్ముడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. మనోజ్ పై దాడి జరగడంతో ఆయన హాస్పిటల్ కు కూడా వెళ్లారు. కానీ మంచు విష్ణు, లక్ష్మి స్పందించినట్లు కనిపించలేదు.. తాజాగా మంచు మనోజ్ ను విష్ణు కలవనున్నారని టాక్. జల్ పల్లి లో ఉంటున్న మంచు మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు పాట్నర్ విజయ్ మనోజ్ ఇంటి సీసీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. అంతేకాదు మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులను కాపలా ఉన్నారని సమాచారం. దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు ఇండియాకు వచ్చారు. మరికాసేపట్లో జల్ పల్లి లోని మంచు మనోజ్ ఇంటికి విష్ణు వెళ్లనున్నట్లు సమాచారం. మరి వారిద్దరి భేటీ తర్వాత గొడవలు తగ్గుతాయా?లేక మరో కొత్త గొడవలు పుట్టుకోస్తాయా? చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×