Kingfisher Towers: దేశవ్యాప్తంగా రియల్ఎస్టేట్ పుంజుకున్నట్లు కనిపిస్తోందా? ప్రధాన సిటీల్లో రియల్ బూమ్ కనిపిస్తుందా? కింగ్ ఫిషర్ టవర్‌లో ఓ ఫ్లాట్ 50 కోట్లకు వెళ్లడం దేనికి సంకేతం? దీంతో రియల్ ఎస్టేట్ సెక్టార్ ఊపందుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బెంగుళూరు రియల్ బూమ్ పెరిగింది. యూబీ సిటీ ప్రాంతంలో కింగ్ ఫిషర్ టవర్స్ ఉంది. ఆ ప్రాంతంలో భూమి కోట్లాది రూపాయలు పలుకుతోంది. ఇందుకు ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కింగ్ ఫిషర్ టవర్స్‌లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు. అక్షరాలా దాని విలువ 50 కోట్ల రూపాయలు. వినడానికి విచిత్రంగా ఉన్నా ముమ్మాటికీ నిజం.
4.5 ఎకరాల స్థలంలో కింగ్‌ఫిషర్ టవర్స్‌ని నిర్మించారు. 2010లో ప్రెస్టీజ్ గ్రూప్- మాల్యా కంపెనీలు జాయింట్ వెంచర్‌లో దీన్ని అభివృద్ధి చేశారు, మూడు బ్లాకుల్లో 81 లగ్జరీ అపార్ట్‌మెంట్‌లను నిర్మించారు. 34 అంతస్తుల ఈ టవర్‌లో సగటున 8,321 చదరపు అడుగుల్లో నిర్మించారు.
మొదట్లో అపార్ట్‌మెంట్లు చదరపు అడుగుకు రూ. 22,000 కి విక్రయించబడ్డాయి. వాటి విలువ క్రమంగా పెరిగింది.. పెరుగుతోంది కూడా. పదహారవ అంతస్తులో ఉన్న 8,400 చదరపు అడుగుల నివాసంలో నాలుగు బెడ్‌రూమ్‌లు, ఐదు ప్రత్యేక కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ డీల్ ధరను చదరపు అడుగుకు రూ. 59,500 గా నిర్ణయించింది.
ALSO READ: ఉద్యోగులకు అలర్ట్.. త్వరగా UAN యాక్టివేషన్ చేసుకోండి!
మరో విషయం ఏంటంటే నారాయణ మూర్తి కొనుగోలు చేసిన ఫ్లాట్ కొత్తది కాదు. కొన్నాళ్ల కిందట ముంబైకి చెందిన ఓ బిజినెస్‌మేన్ కింగ్ ఫిషర్ టవర్‌లో ఒకటి కొనుగోలు చేశారు. దాన్ని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా మూర్తి కొనుగోలు చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
కింగ్‌ఫిషర్ టవర్స్‌లో ఇంతకు ముందు రాజకీయ, వ్యాపారవేత్తలు సైతం ఫ్లాట్లను కొనుగోలు చేశారు. సుధా మూర్తి నాలుగేళ్ల కిందట 23వ అంతస్తులో రూ. 29 కోట్లకు ఓ ఫ్లాట్‌ని కొనుగోలు చేశారు. బయోకాన్ కంపెనీ కిరణ్ మజుందార్-షా, కర్ణాటక రాజకీయ నేత కొడుకు రానా జార్జ్ సైతం అక్కడ ఫ్లాట్ కొనుగోలు చేసిన వారిలో ఉన్నారట.
ఇక హైదరాబాద్ విషయానికొద్దాం.. రీసెంట్‌గా స్థానిక రియల్ ఎస్టేట్ కంపెనీతో ట్రంప్ నిర్మాణ హైదరాబాద్‌లో ట్రంప్ టవర్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఒక్కో ఫ్లాట్ ఎంతకు వెళ్తుందో చూడాలి.